Advertisementt

కాజల్, శ్రీనివాస్.. అంతా రివర్స్..!

Thu 07th Feb 2019 02:54 PM
seetha,kajal agarwal,bellamkonda srinivas,sonusood,teja,characters  కాజల్, శ్రీనివాస్.. అంతా రివర్స్..!
Teja Seetha Movie Characters Details కాజల్, శ్రీనివాస్.. అంతా రివర్స్..!
Advertisement
Ads by CJ

డైరెక్టర్ తేజ - బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘సీత’. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సోనూసూద్ విలన్ గా నటిస్తున్నాడు. సినిమా మొత్తం ఈ ముగ్గురి క్యారెక్టర్ల మధ్యే తిరుగుతుందని టాక్. పెర్ ఫార్మెన్స్ ల పరంగా ఈ సినిమా వీరికి బెస్ట్ సినిమా అవుతుందని సమాచారం.

నిజానికి ఇది తేజ సొంతం సినిమా కథ కాదు. వేరే వాళ్ల దగ్గర నుంచి కథ తీసుకుని తన స్టయిల్ కు మార్చుకున్నారు. ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ సినిమా బాగా వస్తుందట. సీత పాత్రలో కాజల్ ఇరగతీస్తుందని... ఆమె పాత్ర సీత పేరుకు రివర్స్ లో ఉంటుందని... చాలా రాడికల్ గా ఉంటుందని... దీనికి రివర్స్ లో హీరో చాలా ఇన్నోసెంట్ గా ఉంటాడని టాక్.

అలాగే సోనూసూద్ క్యారెక్టర్ చాలా విభిన్నంగా వుంటుందట. ఈ సినిమాలో అందరికన్నా ఎక్కువ పేరు సోనుసూద్ కే వస్తుందని యూనిట్ వర్గాల బోగట్టా. గతంలో తేజ డైరెక్షన్‌లో వచ్చిన ‘నిజం, జయం’ చిత్రంలో విలన్‌గా నటించిన గోపీచంద్‌కి ఎటువంటి పేరు వచ్చిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో కూడా సోనూసూద్ పాత్ర అంతలా గుర్తుండిపోయే పాత్ర అవుతుందని చెబుతున్నారు.

Teja Seetha Movie Characters Details:

3 Main Characters in Seetha Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ