Advertisementt

బాబు సీన్స్ కట్ చేస్తున్నారంట

Thu 07th Feb 2019 01:00 AM
balakrishna,ntr,mahanayakudu,chandrababu naidu,scenes delete  బాబు సీన్స్ కట్ చేస్తున్నారంట
Chandrababu Scenes Deleted in NTR Biopic బాబు సీన్స్ కట్ చేస్తున్నారంట
Advertisement
Ads by CJ

టాక్ ఏమో సూపర్ హిట్ అని వచ్చింది. కలెక్షన్స్ ఏమో మరి దారుణంగా వచ్చాయి. ఈ సంక్రాంతికి ఎన్టీఆర్ బయోపిక్ నుండి కథానాయకుడు సినిమా రిలీజ్ అయింది. ఎన్టీఆర్ నటుడిగా ఎలా ఎదిగాడు అనేది చూపించకుండా ఎన్టీఆర్ లాంటి హీరో దొరకడం టాలీవుడ్ చేసుకున్న పుణ్యం అన్నట్టు చూపించారు. దాంతో కొంతమంది ఈ సినిమాను తిరస్కరించారు.

అందుకే రెండో భాగం మహానాయకుడు విషయంలో అటువంటివి జరగకుండా చాలా జాగ్రత్తలు పడుతున్నారు ఎన్టీఆర్ టీం. ఇందులో ఎన్టీఆర్‌ని అనితర సాధ్యుడిలా చూపించడం కంటే అతనూ వండర్ఫుల్ అనిపించేలా కొన్ని సీన్లు పెడుతున్నారని తెలిసింది. ఇక చంద్రబాబు నాయుడు పాత్రని ఎలివేట్‌ చేసే కొన్ని సన్నివేశాలు వున్నాయట.

ప్రేక్షకుల స్పందన ప్రకారం ఎలేవేషన్స్ సీన్స్ తగ్గించేయనున్నారు. అయినప్పటికీ ఒకటో రెండో చంద్రబాబును ఎలివేట్ చేసే సీన్స్ ఉంటాయట. కానీ ముందు అనుకున్న దానితో పోలిస్తే మాత్రం అది చాలా తగ్గిపోయిందని సమాచారం. ఇది అంత పక్కన పెడితే ఇప్పటివరకు ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వట్లేదు.

Chandrababu Scenes Deleted in NTR Biopic:

NTR Mahanayakudu Latest News

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ