Advertisementt

‘మహానాయకుడు’పై కాస్త క్లారిటీ వచ్చినట్లే!

Wed 06th Feb 2019 08:03 AM
balakrishna,mahanayakudu,release,mahashivaratri  ‘మహానాయకుడు’పై కాస్త క్లారిటీ వచ్చినట్లే!
Mahanayakudu Movie Release Date ‘మహానాయకుడు’పై కాస్త క్లారిటీ వచ్చినట్లే!
Advertisement
Ads by CJ

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఎన్టీఆర్ కథానాయకుడు పాజిటివ్ టాక్ తెచుకున్నప్పటికీ.. రిజల్ట్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. దాంతో చిత్ర బృందం మహానాయకుడు పైనే ఆశలు పెట్టుకున్నారు. ఎలాగైనా ఈ సినిమాను హిట్ చేయాలనీ చాలానే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రేక్షకులకి ఎక్కడా బోర్ కొట్టకుండా ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ ను యాడ్ చేస్తూ ఈ మహానాయకుడిని తెరకెక్కించినట్లుగా తెలుస్తుంది. 

మహానాయకుడితో ఎట్టి పరిస్థితుల్లో హిట్ కొట్టాలనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. కథానాయకుడు కొని నష్టపోయిన డిస్ట్రీబ్యూటర్లకి, బయ్యర్స్ కే మహానాయకుడుని అమ్మి వాళ్ళకు వచ్చిన నష్టాలన్ని లాభాలుగా మార్చాలని ఎన్టీఆర్ మేకర్స్ భావిస్తున్నారట. పైగా ఇందులో ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని చూపించనున్నారు. ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో మలుపులు, ట్విస్ట్స్ ఉన్నాయి. సో ఈ సినిమాకి ప్రేక్షకులు ఎక్కువ కనెక్ట్ అవుతారని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.

మరి ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ మేకర్స్ ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి. అయితే ఇప్పటి వరకు మహానాయకుడు రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వలేదు ఎన్టీఆర్ టీం. తాజాగా మహానాయకుడు మార్చ్ 5 మహా శివరాత్రి కానుకగా విడుదలయ్యే సూచనలు ఉన్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయాన్నీ మేకర్స్ త్వరలోనే అధికారంగా అనౌన్స్ చేయనున్నారు. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Mahanayakudu Movie Release Date:

Mahanayakudu Movie Release on Mahashivaratri

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ