నేటి రోజుల్లో మన స్టార్స్‌కి ఒకరితో కంటే ఇద్దరు ముగ్గురితో రొమాన్స్ చేసి ప్రేక్షకులను, సౌందర్యాధకులను మెప్పించడం కామన్ అయిపోయింది. కథను బట్టి గాక ఇద్దరు హీరోయిన్లు, మరోవైపు ఓ స్పెషల్ సాంగ్‌లో మరో బ్యూటీతో ఆడిపాడి మెప్పిస్తున్నారు. ఇక తాజాగా ఇద్దరు యంగ్‌స్టార్స్ మాత్రం ఏకంగా నలుగురు హీరోయిన్లతో ఆడిపాడేందుకు సిద్దం అవుతున్నారు. వారే సెన్సేషనల్, రౌడీస్టార్ విజయ్‌దేవరకొండ.. నేచురల్ స్టార్ నాని.
విజయ్‌దేవరకొండ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో నటిస్తున్నాడు. దీని తర్వాత ‘ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ వంటి చిత్రాల ద్వారా సెన్సిబుల్ దర్శకునిగా పేరు తెచ్చుకున్న క్రాంతి మాధవ్ డైరెక్షన్‌లో సీనియర్ స్టార్ నిర్మాత కె.యస్.రామారావు సమర్పణలో కె. వల్లభ క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్‌లో దీనిని నిర్మిస్తున్నారు. ఇటీవలే ‘తేజ్ ఐ లవ్ యు’ వంటి ఫ్లాప్‌ని ఎదుర్కొన్న ఈ నిర్మాణ సంస్థ విజయ్ దేవరకొండ చిత్రంతో భారీ హిట్ కొట్టాలని చూస్తోంది. ఇంతవరకు రౌడీస్టార్‌గా కనిపించిన విజయ్ దేవరకొండ ఈ మూవీ ద్వారా రోమియో స్టార్‌గా మారాలని భావిస్తున్నాడు. ఈ మూవీలో ఆయన సరసన నలుగురు హీరోయిన్లు నటిస్తారట. ఇప్పటికే రాశిఖన్నా, ఐశ్వర్యారాజేష్, ఇసబెల్‌ని ఎంపిక చేసిన యూనిట్ నాలుగో హీరోయిన్‌గా కేథరిన్ త్రెస్సాను ఫైనల్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మరో వైపు నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరు దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ‘జెర్సీ’ చిత్రంలో రంజీ క్రికెట్ ప్లేయర్‌గా నటిస్తున్నాడు. దీని తర్వాత ఆయన మైత్రి మూవీ మేకర్స్ బేనర్‌లో ఇంటెలిజెంట్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఇందులో టీనేజర్‌గా, యువకునిగా, మధ్యవయస్కునిగా, ముసలి ఛాయలు కనిపించే నాలుగు విభిన్న షేడ్స్ ఉండే ఛాలెంజింగ్ పాత్రను నాని చేస్తున్నాడు. ఇందులో కూడా ఆయన పాత్రతో పాటు క్యారీ అయ్యే నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇందులో ఇప్పటికి కీర్తిసురేష్, ప్రియా ప్రకాష్ వారియర్, మేఘా ఆకాష్‌లను కన్‌ఫర్మ్ చేశారు. మరో హీరోయిన్ పాత్రధారిని ఎంపిక చేయాల్సివుందని, వీరితో పాటు ఐదో భామకు కూడా ఇందులో స్థానం ఉందని వార్తలు వస్తున్నాయి.
‘జెర్సీ’ చిత్రానికి ప్రీరిలీజ్ బిజినెస్సే ఏకంగా 50కోట్లు దాటడంతో ఈ మూవీని నాని కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో ఏకంగా 50కోట్లపైగా ఖర్చుతో నిర్మిస్తున్నారు. మొత్తానికీ ఈ మధ్య నాని, విజయ్‌దేవరకొండలు యంగ్‌స్టార్స్‌గా బాగా పోటీ పడుతున్నారు. మరి రాబోయే కాలంలో ఈ ఇద్దరు నువ్వా? నేనా? అన్నట్లుగా పోటీపడటం ఖాయమనే చెప్పాలి.