Advertisementt

కన్నుగీటు భామని పట్టించుకునే వారే లేరు!

Tue 05th Feb 2019 05:29 PM
priya prakash varrier,lovers day,promotions,tollywood  కన్నుగీటు భామని పట్టించుకునే వారే లేరు!
No Importance to Priya Varrier in Tollywood కన్నుగీటు భామని పట్టించుకునే వారే లేరు!
Advertisement
Ads by CJ

తాత్కాలికంగా వచ్చే కీర్తి, క్రేజ్‌లు ఎక్కువ కాలం నిలబడవు. అలాగే ఆయాచితంగా వచ్చిన డబ్బు కూడా నిలబడదని, అది మనిషి పొగరును తలకెక్కిస్తుందని పెద్దలు చెబుతారు. ఇది అక్షరసత్యం. నేడు చాలా మంది సోషల్‌ మీడియాలో ఏదో ఒక విషయంతో పాపులర్‌ అవుతూ, వైరల్‌ అవుతుంటారు. ఏదో వివాదాలు, తప్పుడు వ్యాఖ్యలతో తాత్కాలికంగా పేరు సాధించినా అది తాత్కాలికమే అవుతుంది. గతంలో ఎందరో నటీనటులు , దర్శకులు మొదటి రెండు మూడు చిత్రాలతో సంచలనం సృష్టించినా ఆ తర్వాత త్వరగానే తెరమరుగయ్యారు. దీనికి ‘కొలవెరి కోలవెరి’ పాట నుంచి శ్రీరెడ్డి నుంచి ఇటీవల తన కన్నుగీటుతో దేశవిదేశాలలో కూడా విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్న మలయాళ భామ ప్రియా ప్రకాష్‌ వారియర్‌ వరకు ఎందరినో ఉదాహరణగా చెప్పవచ్చు. 

ఇక ప్రియా ప్రకాష్‌ వారియర్‌ విషయానికి వస్తే తనకి అల్లుఅర్జున్‌ నుంచి ఎన్నో చిత్రాలలో అవకాశాలు వచ్చినా తాను ఒప్పుకోలేదని, చివరకు కరణ్‌జోహార్‌ వంటి వారు కూడా తనని ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ముందుకు వచ్చారని ఆమె బడాయిలు పోయింది. ఇక ఈమె కన్నుగీటిన మొదటి చిత్రమే ‘ఒరు ఆధార్‌ లవ్‌’ చిత్రం మలయాళంతో పాటు తెలుగులో ‘లవర్స్‌డే’ పేరుతో ప్రేమికుల దినోత్సవం అయిన ఫిబ్రవరి14న విడుదల కానుంది. దీంతో ఈమెకి టాలీవుడ్‌లో ఒక్కసారిగా అవకాశాలు వెల్లువెత్తుతాయని పలువురు భావించారు. 

కానీ ఈ చిత్రం విడుదలకు అతి తక్కువ రోజులే ఉన్నా దీనికి సరైన క్రేజ్‌ రావడం లేదు. ఎవ్వరూ దీనిని పెద్దగా పట్టించుకోకపోవడం మరో విశేషం. అందునా అల్లుఅర్జున్‌ని వేడుకకు పిలిచినా ప్రియా మాత్రం హాట్‌టాపిక్‌ కాలేకపోయింది. ఈ వేడుకలో బన్నీ పొరపాటుగా ‘కట్టప్పని బాహుబలి ఎందుకు చంపాడు’ అని పూర్తి రివర్స్‌గా మాట్లాడి నవ్వుల పాలయ్యాడు. అలా బన్నీ వ్యాఖ్యలు హైలైట్‌ అయ్యాయే గానీ ప్రియా మాత్రం ఆకట్టుకోలేకపోతోంది. ఏదైనా అద్భుతం జరిగి ‘లవర్స్‌డే’ బాగా ఆడితే తప్ప ఈమెకి తదుపరి అవకాశాలు కనిపించే సూచనలు లేవని విశ్లేషకులు అంటున్నారు. 

No Importance to Priya Varrier in Tollywood:

Poor Promotions to Lovers Day Movie 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ