Advertisementt

‘యాత్ర’కు ఇది సరిపోదు.. పెంచాల్సిందే!

Mon 04th Feb 2019 07:54 PM
yatra,ntr kathanayakudu,yatra movie,ysr biopic,buzz,craze,yatra promotions  ‘యాత్ర’కు ఇది సరిపోదు.. పెంచాల్సిందే!
No Craze To Yatra.. promotions very Poor ‘యాత్ర’కు ఇది సరిపోదు.. పెంచాల్సిందే!
Advertisement
Ads by CJ

సినిమాపై అంచనాలు ఉంటే మంచిదే. కానీ అది కొన్ని కొన్ని సార్లే. సినిమాపై మరీ అంచనాలు ఎక్కువ అయిపోతే సినిమాపై ఎఫెక్ట్ పడే అవకాశముంది. సినిమాలో ఎక్కడ కొంచెం తేడా కొట్టిన ఆ ఎఫెక్ట్ సినిమాపై పడుతుంది. కొన్నిసార్లు అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు సక్సెస్ అయినా దాఖలాలు కూడా ఉన్నాయి. మహానటి అదే కోవకి చెందింది.

ఈ సినిమా వచ్చేవరకు పెద్ద‌గా అంచ‌నాలు లేవు. కానీ సినిమా వచ్చాక సినిమా చూసి ఔరా అనుకున్నారు. ఇక సంక్రాంతికి రిలీజ్ అయిన ఎన్టీఆర్ కథానాయకుడుపై ముందు నుండే భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాలో విషయం లేకపోవడంతో ఎమోష‌న్లు వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డం చేటు చేసింది. మరి మహానాయకుడు పరిస్థితి ఏంటో చూడాలి. ఈసినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు అయితే లేవు.

ఇక టాలీవుడ్‌లో మరో బయోపిక్ రానుంది. అదే వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మీద తీసిన ‘యాత్ర‌’. ఈ సినిమాటిక్ పరంగా అయితే పెద్దగా అంచనాలు లేవు. ఎందుకంటే వైఎస్ ఏమీ సినిమా వాడు కాదు కాబ‌ట్టి.. గ్లామ‌ర్ ట‌చ్ అంతగా పడటం లేదు. కాకపోతే పొలిటికల్‌గా మాత్రం మంచి అంచనాలే ఉన్నాయి. అందులోనూ ఇది ప్ర‌ధానంగా వైఎస్ పాద‌యాత్ర నేప‌థ్యంలో సాగే చిత్రం. అయితే డైరెక్టర్ మ‌హి.వి. రాఘ‌వ్ ఒక క‌న్విక్షన్‌తో ఈ సినిమా తీశాడు. ఇది వైఎస్ సినిమాగా కాకుండా మామూలుగా చూసినా ఇది న‌చ్చే సినిమా అంటున్నాడు. రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ నటుడు మ‌మ్ముట్టి నటించారు. ఇది జనాల్లోకి వెళ్లాలంటే ఇంకాస్త గట్టిగా ప్రమోషన్ చేయాల్సి ఉంది.

No Craze To Yatra.. promotions very Poor :

Yatra in NTR Kathanayakudu Way

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ