ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడితో నిర్మాతలైన బాలయ్య అండ్ బ్యాచ్ దాదాపుగా 50 కోట్లు నష్టపోయారు. 72 కోట్లలకు థియేట్రికల్ రైట్స్ అమ్మితే కథానాయకుడు ఫైనల్ షేర్ 20 కోట్లు దగ్గరే ఆగిపోయింది. దానితో బాలయ్య అండ్ బ్యాచ్ కి భారీ లాస్ వచ్చింది. దర్శకుడు క్రిష్ కి కథానాయకుడితో మంచి అభినందనలు దక్కినా.. డబ్బు విషయంలో మాత్రం క్రిష్ కూడా కథానాయకుడు వలన నష్టపోయాడనే న్యూస్ మాత్రం ఫిలింనగర్ సాక్షిగా చక్కర్లు కొడుతోంది. అయితే పారితోషకం విషయంలో మాత్రం కాదట క్రిష్ నష్టపోయింది.. వేరే విషయంలో ఎన్టీఆర్ తో క్రిష్ లాస్ అయ్యాడంటున్నారు.
మామూలుగానే క్రిష్ దర్శకుడిగా నిర్మాతగా కూడా కొనసాగుతున్నాడు. క్రిష్ తన ఫ్రెండ్స్ తో కలిసి కేవలం సినిమాలే కాదు... చాలా సీరియల్స్ కూడా నిర్మిస్తుంటాడు. అయితే ఎన్టీఆర్ కథానాయకుడు దర్శకుడిగా క్రిష్ కి కథానాయకుడు మీదున్న నమ్మకంతో.. గుంటూరు ఏరియా హక్కులను క్రిష్ కొన్నట్లుగా చెబుతున్నారు. ఆ గుంటూరు ఏరియా హక్కులను క్రిష్ సుమారుగా 6 కోట్లకు కొన్నట్టుగా.... అందులో మూడు కోట్ల వాటాని క్రిష్ వేరే వాళ్లకు అమ్మేశాడట. అయితే ఇప్పుడు ఆరుకోట్లకు కొన్న గుంటూరు ఏరియా ఇప్పుడు మూడు కోట్ల కలెక్షన్స్ కూడా తేలేదట.
మరి ఆరు కోట్లలో మూడు కోట్లు వస్తే.. మూడు కోట్లు నష్టాలూ ఎన్టీఆర్ బయోపిక్ తో చవిచూశారు క్రిష్ అండ్ ఆ వాటాదారుడు. మరి మూడు కోట్లకు క్రిష్ వేరే వాళ్లకు అమ్మబట్టి.. కేవలం కోటిన్నర లాస్ తోనే సరిపెట్టుకున్నాడు. లేదంటే... క్రిష్ మెడకు ఎన్టీఆర్ బయోపిక్ తో మూడు కోట్లు చుట్టుకునేవి. మరి దర్శకుడిగా కథానాయకుడు విషయంలో క్రిష్ ఎంతగా నమ్మినా.. ఆయన అంచనాలు ప్రేక్షకులు తారుమారు చెయ్యబట్టే.. 50 కోట్ల నష్టాలు నిర్మాతలు అనేకన్నా.. డిస్ట్రిబ్యూటర్స్ చవిచూశారు. ఇక మహానాయకుడు థియేట్రికల్ రైట్స్ కాస్త తక్కువకు తీసుకుని ఆ నష్టాలను పూడ్చుకోవాలని... డిస్ట్రిబ్యూటర్స్ తో పాటుగా ఇప్పుడు క్రిష్ కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి.