Advertisementt

సచిన్ జోషి చాలా విషయాలు చెప్పేశాడు

Sun 03rd Feb 2019 05:54 PM
sachin joshi,amavasya movie,interview,updates  సచిన్ జోషి చాలా విషయాలు చెప్పేశాడు
Sachin Joshi Latest Interview Updates సచిన్ జోషి చాలా విషయాలు చెప్పేశాడు
Advertisement
Ads by CJ

క్లాసిక్ హర్రర్ చిత్రంగా ‘అమావాస్య’ ప్రేక్ష‌కులను మెప్పిస్తుంది - స‌చిన్ జోషి

‘మౌన‌మేల‌నోయి, నిను చూడ‌క నేనుండ‌లేను, ఒరేయ్ పండు, నీ జ‌త‌గా నేనుండాలి’ వంటి చిత్రాల్లో త‌న‌దైన న‌ట‌న‌తో ప్రేక్షకుల‌ను మెప్పించిన న‌టుడు స‌చిన్ జోషి హీరోగా వైకింగ్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్‌ పై ‘1920 ఈవిల్‌ రిటర్స్స్‌’, ‘రాగిని యంయంఎస్‌, అలోన్‌’ లాంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు భూషన్‌ పటేల్‌ దర్శకత్వంలో రైనా సచిన్‌జోషి, దీపెన్‌ ఆమిన్‌ నిర్మాణంలో రూపొందిన హర్రర్ చిత్రం ‘అమావాస్య’. న‌ర్గిస్ ఫ‌క్రి హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 8న విడుద‌ల కానుంది. ఈ సందర్భంగా... సచిన్‌జోషి ఇంటర్వ్యూ.

చాలా గ్యాప్ తరువాత మళ్లీ ‘అమావాస్య’ అని వస్తున్నారు ?

- నేను చాలా కాలంగా హర్రర్ సినిమా చేయాల‌ని ఎదురుచూస్తున్నాను. అలాంటి స‌మ‌యంలో భూష‌ణ్ ప‌టేల్ నాకు ఈ స్క్రిప్ట్ గురించి చెప్పారు. నా గ‌త చిత్రాల‌కు ఇది పూర్తి భిన్న‌మైన సినిమా. అమావాస్య ఓ క్లాసిక్ హర్రర్ మూవీ. తెలుగులో హర్రర్ చిత్రాల‌కు మంచి ఆద‌ర‌ణ దొరుకుతున్న స‌మ‌యంలో మంచి కాన్సెప్ట్‌తో సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది.

ఈ సినిమా ప్రోమోలు చూస్తుంటే.. ఇది పూర్తిగా హర్రర్ నేపథ్యంలో సాగుతున్నట్లు అనిపిస్తోంది ?

- అవునండి.. ఇది పూర్తిగా హర్రర్ నేపథ్యంలోనే సాగుతుంది. సినిమాలోని కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. అలాగే డైరెక్టర్ భూషణ్ పటేల్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే.. అమావాస్య ఒక క్లాసిక్ హర్రర్ ఫిల్మ్.

ఇప్ప‌టి వ‌ర‌కు చాలా హర్రర్ సినిమాలు వ‌చ్చాయి క‌దా ?

- ఫస్ట్ రెగ్యులర్ గా వచ్చే హర్రర్ సినిమాలా ఉండదు ఈ సినిమా. మెయిన్ గా సినిమాలో కనిపించే వి.ఎఫ్.ఎక్స్ చాలా కొత్తగా, వైవిధ్యంగా ఉంటాయి. అన్నిటికి మించి ‘అమావాస్య‌’లో ఆకట్టుకునే గొప్ప స్టోరీ ఉంది. సినిమాకే స్టోరీ హైలెట్ గా నిలుస్తోంది. అదేవిధంగా ఇంటర్నల్ గా సినిమాలో ఎంతవరకు రాని ఒక యూనిక్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఈ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులను థ్రిల్‌ చేస్తుంది.

ఈ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి?

- ఈ చిత్రంలో నేను క‌ర‌ణ్ అనే పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాను. న‌ర్గిస్ ఫ‌క్రి అహానా అనే అమ్మాయి పాత్ర‌లో న‌టించింది. నేను న‌ర్గిస్‌ను పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పిన‌ప్పుడు ఆమె వీకెండ్‌లో స‌మ్మ‌ర్ హౌస్‌కి వెళ్లాల‌ని అంటుంది. కానీ హీరోకి ఆ ఇంటికి వెళ్ల‌డం ఇష్టం ఉండ‌దు. అలాంటి స‌మయంలో వారు ఆ ఇంటికి ఎలా వెళ్లారు? అక్క‌డ వారికి ఎలాంటి ప‌రిస్థితులు ఎదురయ్యాయ‌నేదే సినిమా. ఆ వీకెండ్‌లో అమావాస్య రాత్రి ఈవిల్ ఏం చేసింద‌నేదే సినిమా. ఈ సినిమా హిందీ మరియు తెలుగులో విడుదల కాబోతుంది.

అంటే రెండు భాషల్లోనూ షూట్ చేశారా ?

- సినిమాను రెండు భాష‌ల్లో చిత్రీక‌రించాం. ముఖ్యంగా క్లోజ‌ప్ షాట్స్‌ను తెలుగులో చిత్రీక‌రించాం. ఎందుకంటే తెలుగు సినిమాకు నా తొలి ప్రాధాన్య‌త ఎప్పుడూ ఉంటుంది.

మీ డైరెక్టర్ గురించి చెప్పండి ?

- ఆయన హర్రర్ ఫిల్మ్ స్పెషలిస్ట్. పైగా ఈ సారి కథనే చాలా కొత్తగా రాశారు. ఇక ఆయన ఇప్పటివరకూ తీసిన 1920 ఈవిల్ రిటర్న్స్, రాగిణి ఎం ఎం ఎస్, అలోన్ సినిమాలు హర్రర్ సినిమాలే. ఒక హర్రర్ సినిమాకు ఏమి కావాలో ఆయనకు బాగా తెలుసు. ఈ జోనర్ అంటే ఆయనకు బాగా ఇష్టం. ఆయన చూసి నాక్కూడా ఈ జోనర్ పై ఇష్టం పెరిగింది. ఇప్పుడు ప్రతి హర్రర్ ఫిల్మ్ చూస్తున్నాను.

ఈ సినిమాలో మీకు జోడిగా నటించిన హీరోయిన్ నర్గీస్ ఫక్రీ గురించి చెప్పండి ?

- నర్గీస్ ఫక్రీ చాలా బాగా చేసింది. తను హార్డ్ వర్కర్. ప్రతి సీన్ చేసే ముందు, ఆ సీన్ లోని సోల్ ను పట్టుకొని యాక్ట్ చెయ్యటానికి ట్రై చేసేది. సినిమా పట్ల తనకున్న డెడికేషన్ చాలా గొప్పది.

హర్రర్ సినిమాలు అంటే మ్యూజిక్ కి ఎక్కువ ప్రాధాన్యముంటుంది కదా?

- అవునండి! ఒక్క హర్రర్ సినిమాలకే కాదు ఇండియాలో మ్యూజిక్ కి మంచి ప్రాధాన్యం ఉంటుంది. ఎక్కువ సంగీతప్రియులు ఇండియాలోనే ఉంటారు. నేను కూడా సంగీతాభిమానినే, నేను తెలుగులో సినిమా చేస్తున్నప్పుడు కూడా దగ్గరుండి మ్యూజిక్ చేయించుకుంటాను. నా తొలి చిత్రం మౌనమేలనోయి సినిమాలో ‘ఓ ప్రియురాలా...’ పాటని రమణ గోగుల గారి దగ్గిర 3 రోజులు కూర్చుని చేయించుకున్నాను. సాధార‌ణంగా హర్రర్ సినిమాల‌ను డైరెక్ట్ చేసే ద‌ర్శ‌కులు హర్రర్ సినిమాల‌ను ఎంత ఆస‌క్తికరంగా తెర‌కెక్కించాం.. ఎంత మంచి సౌండ్ టెక్నాల‌జీని ఉప‌యోగించాం అని చూస్తారు. ఇక్కడ క‌థ‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. హాలీవుడ్ స్థాయిలో హర్రర్ చిత్రాన్ని అందించాల‌ని ఛాలెంజింగ్‌గా భావించి ఈ సినిమా చేశాం.

ఈ సినిమాలో అలీ అజ్గర్ పాత్ర ఎలా ఉటుంది..?

- ఈ సినిమాలో మేము వీకెండ్ కి వెళ్లే బంగ్లాకి కేర్ టేకర్ పాత్రలో అలీ అజ్గర్ కనిపిస్తాడు. డైరెక్టర్ ఆయన పాత్రని డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది. ఆయన క్యారెక్టర్ కి ఈ సినిమాలో మంచి ప్రాధాన్యం ఉంటుంది. ఎవ్వరు ఉండని ఈ హాంటెడ్ బంగ్లాకి అలీ అజ్గర్ ఎందుకు కేర్ టేకర్ గా ఉంటాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

మీ తదుపరి చిత్రాలు గురించి చెప్పండి ?

- ఒకటి రెండు స్టోరీస్ విన్నాను. చాలా బాగున్నాయి. అయితే నెక్స్ట్ సినిమా ఏం చెయ్యాలో ఇంకా నిర్ణయించుకోలేదు. మా ‘అమావాస్య’ రిలీజ్ అయిన తరువాతే, ఏ జోనర్ లో ఎలాంటి సినిమా చెయ్యాలో ఆలోచిస్తాను. అంటూ ఇంటర్వ్యూ ముగించారు హీరో సచిన్ జోషి.

Sachin Joshi Latest Interview Updates:

Sachin Joshi Talks about Amavasya Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ