కేవలం బోయపాటి శ్రీను చెప్పిన లైన్ తోనే సినిమా ఓకే చేశానని.. ఫుల్ స్క్రిప్ట్ ఏంటో తెలుసుకోకుండా బోయపాటిని గుడ్డిగా నమ్మి సినిమా చేశానని చరణ్ వినయ విధేయ రామ ప్రమోషన్ ఇంటర్వ్యూలలో చెప్పాడు. అలా చేయడం వల్ల సినిమా రిజల్ట్ కూడా తేడా వచ్చింది. చరణ్ కెరీర్ లో టాక్ పరంగా ఈ సినిమాకి వచ్చిన నెగటివ్ మరి ఏ సినిమాకి రాలేదు. అయితే అదే పొరపాటు బాలయ్య చేయను అంటున్నాడట.
బాలయ్య - బోయపాటి కాంబినేషన్ లో ఓ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. దీన్ని అధికారంగా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా విషయంలో బాలయ్య ఆచి తూచి అడుగులు వేస్తున్నాడట. సాధారణంగా బాలయ్యకు లైన్ నచ్చితే చాలు గుడ్డిగా ఆ డైరెక్టర్ ని నమ్మి సినిమా చేసేస్తాడు. కానీ ఇప్పుడు బోయపాటి చెప్పిన లైన్ ను ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ తో రమ్మని.. అప్పుడే సినిమా చేస్తానని కండీషన్ పెట్టాడట.
వివిఆర్ లో జరిగిన తప్పులు బాలయ్య సినిమాలో జరగకూడదని జాగ్రత్త పడుతున్నాడు. మరి బాలయ్య కోరినట్టు శ్రీను ఫుల్ స్క్రిప్ట్ ఎప్పుడు రెడీ చేసి సెట్స్ మీదకు ఎప్పుడు తీసుకుని వేళ్తాడో చూడాలి. ఏది ఏమైనా వివిఆర్ ఎఫెక్ట్ శ్రీను పైన బాగానే పడింది.