Advertisementt

‘యమ్‌6’ చిత్రం అందర్నీ అలరిస్తుంది: నిర్మాత

Sat 02nd Feb 2019 07:44 PM
producer,viswanath tanniru,m6 film, interview,details  ‘యమ్‌6’ చిత్రం అందర్నీ అలరిస్తుంది: నిర్మాత
Producer Hopes on M6 Film ‘యమ్‌6’ చిత్రం అందర్నీ అలరిస్తుంది: నిర్మాత
Advertisement
Ads by CJ

ఫిబ్రవరి 8న విడుదలవుతున్న మా ‘యమ్‌6’ చిత్రం అందర్నీ అలరిస్తుంది- నిర్మాత విశ్వనాథ్‌ తన్నీరు 

విశ్వనాథ్‌ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీ లక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై విశ్వనాథ్‌ తన్నీరు నిర్మించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘యమ్‌6’. ఈ చిత్రం ఫిబ్రవరి 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత విశ్వనాథ్‌ తన్నీరు మాట్లాడుతూ ‘‘నటుడిగా అవ్వాలనే కోరికతో ఇండస్ట్రీకి వచ్చాను. మొదట్లో కొన్ని టీవీ సీరియల్స్‌లో నటించటంతో పాటు, కొన్ని సీరియల్స్‌ నిర్మించాను కూడా. అలాగే కొన్ని చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేశాను. ప్రస్తుతం నిర్మాతగా నూతన నటీనటులు ధ్రువ, అశ్విని (మిస్‌ బెంగుళూరు), నూతన దర్శకుడిని సినీ రంగానికి పరిచయం చేస్తూ ‘యమ్‌6’ సినిమా నిర్మించాను. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 8న విడుదల చేస్తున్నాం. ఇదొక హారర్‌, కామెడీ, థ్రిల్లర్‌. క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించాం.

దర్శకుడు జైరాం వర్మ చెప్పిన ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ నచ్చి ఈ సినిమా నిర్మించాను. ఈ చిత్రానికి కథే హీరో. అందరికీ నచ్చే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఇలాంటి సినిమాకి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చాలా ఇంపార్టెంట్‌. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకి ఆర్‌ఆర్‌ బాగా కుదిరింది. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు ఎక్కడా బోర్‌ ఫీల్‌ అవ్వరు. ఉత్కంఠకు గురి అవుతారు. అనుకోకుండా వచ్చే మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ సినిమాను దర్శకుడు చక్కగా తెరకెక్కించారు. నటీనటులు కొత్తవాళ్ళైనా బాగా నటించారు. ఈ సినిమాలోని ‘ఈ క్షణం’ అనే మెలోడియస్‌ పాటను అరకు, మంగుళూరులోని సుందరమైన లొకేషన్స్‌లో చిత్రీకరించాం.

‘యమ్‌6’ అనే డిఫరెంట్‌ టైటిల్‌ ఎందుకు పెట్టామో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. నా అభిమాన దర్శకులు వి.వి.వినాయక్‌గారు మా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయటం ఎంతో ఆనందాన్ని కలిగించింది. మా సినిమాను ప్రేక్షక దేవుళ్ళు విజయంతో ఆదరిస్తారనే ఆశిస్తున్నాను. ఇలాంటి చిన్న చిత్రాలని ఆదరిస్తే మాలాంటి కొత్త నిర్మాతలు మరిన్ని చిత్రాలు నిర్మించటానికి వీలుంటుంది. నా స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్నాం. ఆ వివరాలను త్వరలో తెలియజేస్తాం అన్నారు. 

ధ్రువ, శ్రావణి, అశ్విని, తిలక్‌, సాధన, అప్పలరాజు, హరిత, వంశీ, ఇంద్రతేజ నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : సురేష్‌, సంగీతం : విజయ్‌ బాలాజీ, సినిమాటోగ్రఫీ : మహ్మద్‌ రియాజ్‌, కాస్టింగ్‌ : స్టార్‌ యాక్టింగ్‌ స్టూడియో, ఎడిటింగ్‌ : వంశీ కందాల, పబ్లిసిటీ డిజైన్‌ : టాకింగ్‌ పిక్చర్స్‌ స్టూడియో సోమేశ్వర్‌ పోచం, నిర్మాత : విశ్వనాధ్‌ తన్నీరు, కధ-స్క్రీన్‌ ప్లే-దర్శకత్వం : జైరామ్‌ వర్మ 

Producer Hopes on M6 Film:

M6 Film Producer Viswanath Tanniru Interview

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ