Advertisementt

సాయిపల్లవి చేజేతులా చేసుకుంది

Sat 02nd Feb 2019 07:32 PM
sai pallavi,heroine,flop,padi padi leche manasu,sharwanand,maari 2  సాయిపల్లవి చేజేతులా చేసుకుంది
No Movies in Sai Pallavi Hand సాయిపల్లవి చేజేతులా చేసుకుంది
Advertisement
Ads by CJ

ప్రేమమ్, ఫిదా సినిమాలతో ప్రేక్షకులకు పరిచయం అయిన సాయి పల్లవి చాలా త్వరగా స్టార్ హీరోయిన్ అయిపోతుందని భావించారు అంతా. కానీ వచ్చిన ఆఫర్స్ ని కాలితో తన్నేస్తుంది. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన శ్రీనివాస కళ్యాణంలో ఛాన్స్ వచ్చినా నో చెప్పింది. మంచి హీరో మంచి కథ అయితేనే ఓకే చెప్తానంటూ పట్టుబట్టుకు కూర్చుంది సాయిపల్లవి.

రీసెంట్ గా ఆమె నటించిన రెండు సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్ అయ్యాయి. శర్వాతో  ‘పడి పడి లేచే మనసు’ నాగశౌర్యతో ‘కణం’. అంతేకాదు స్కిన్ షో చేయను అని చెప్పడంతో అసలు ఆఫర్స్ రావడంలేదు. ఒకటి రెండు ఆఫర్స్ వచ్చినా వాటికి కూడా కండిషన్స్ పెట్టడంతో ఈమె దగ్గరకి ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అసలు రావడంలేదు.

హీరోయిన్ గా అవకాశం వచ్చినప్పుడు ప్రతి సినిమా ఓకే చేస్తే అప్పుడప్పుడు ఫిదా లాంటి సినిమాలు వస్తుంటాయి. ఇండస్ట్రీలో ఉండాలి అంటే వచ్చిన ప్రతి సినిమాకు ఓకే చెప్పాల్సిందే. ఈ ఫార్ములా ఆలోచించే చాలామంది హీరోయిన్స్ సక్సెస్ అయ్యారు. తమిళంలో లేటెస్ట్ గా చేసిన మారి 2 నెగటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో తమిళంలో కూడా సీన్ రివర్స్ అయ్యింది. తెలుగులో రెండు మూడు ఆఫర్స్ ఉన్నా అవి ఇంకా ఓకే చేయలేదు. సో అలా ప్రస్తుతం సాయి పల్లవికి ఆఫర్స్ తగ్గాయనే చెప్పాలి.

No Movies in Sai Pallavi Hand:

Sai Pallavi Turns A Flop Heroine

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ