ఒక గ్లామర్ హీరోయిన్ మరో గ్లామర్ ఫ్యామిలీకి కోడలయ్యింది అంటే.. పెద్ద ఆశ్చర్యం ఉండదు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ మొత్తం గ్లామర్ ఫీల్డ్ కి దాసోహమే గనుక. అయితే గ్లామర్ ప్రపంచం నుండి వచ్చిన ఆ హీరోయిన్ ఎంత గ్లామర్ ఫ్యామిలీకి కోడలైనా కాస్త అందాలు ఆరబొయ్యడానికి సంకోచిస్తారు. కానీ అక్కినేని సమంత మాత్రం పెళ్లయ్యాకే గ్లామర్ ఎక్కువైందా అని అనిపించకమానదు. హాట్ హీరోయిన్ గా టాలీవుడ్ ని ఏలిన సమంత అక్కినేని ఫ్యామిలీ వారసుడు నాగ చైతన్యని ప్రేమ వివాహం చేసుకుంది. అక్కినేని నాగేశ్వరావు... నాగార్జున ఇలా అంతా గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నవారే. ఒకప్పుడు నాగార్జున వైఫ్ అమల కూడా హీరోయిన్. ఇక సమంత పెళ్లయ్యాక కెరీర్ లో ఎటువంటి తేడా ఉండదని.. పెళ్ళికి ముందు నుండి చెబుతున్నట్టుగానే ఆమె వ్యవహరిస్తోంది.
భర్తతో కలిసి హాలిడే ట్రిప్స్ లో హాట్ హాట్ గా ఎంజాయ్ చెయ్యడమే కాదు.... హాట్ హాట్ ఫోటో షూట్స్ ని సోషల్ మీడియాలో పెట్టి సెగలు రేపుతోంది. గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న సమంత ఈ ఏడాది కూడా తన జోరు చూపిస్తుంది. నాగ చైతన్యతో మజిలి సినిమాతో పాటుగా... తమిళ రీమేక్ 96 లోను, నందిని రెడ్డి బేబీ సినిమాలోనూ నటిస్తుంది. ఇక కొంతకాలం క్రితం నటనకు ప్రాధాన్యమున్న పాత్రలనే ఓకే చేస్తానని చెప్పిన సమంత మాత్రం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోతుంది. వెకేషన్స్ లో బికినీ వేసిన.... హాట్ ఫొటోలకు ఫోజులిచ్చినా సమంతకు చెల్లిందా అనిపించేలా ఉంది.. ప్రస్తుతం సమంత బ్లాక్ డ్రెస్ పిక్ చూస్తే.
ఆ ఫొటోలో లోపలి దుస్తులు కనబడేలా ట్రాన్ఫరెంట్ ఫ్రాక్ లో సమంత హాట్ నెస్ చూస్తే అసలీమెకు పెళ్లయిందా అని అనిపించక మానదు. ఆ బ్లాక్ ఫ్రాక్ లో సమంత అలా గుండెలు చెదిరేలా చూపులు చూస్తుంటే.. చూపులతోనే చంపేస్తుందా అనిపిస్తుంది. మరి మీరు సమంత హాట్ అందాలను వీక్షించండి.