Advertisementt

బాలయ్య ముఖ్యమంత్రి.. బోయపాటి క్లారిటీ

Sat 02nd Feb 2019 06:42 PM
balakrishna,cm,boyapati srinu,ntr biopic,kathanayakudu,mahanayakudu,balayya,chief minister  బాలయ్య ముఖ్యమంత్రి.. బోయపాటి క్లారిటీ
Balakrishna Cannot Be a CM బాలయ్య ముఖ్యమంత్రి.. బోయపాటి క్లారిటీ
Advertisement
Ads by CJ

మహానాయకుడులో ఎన్టీఆర్ పాత్రధారిగా నటిస్తున్న బాలకృష్ణ ఎలాగూ ముఖ్యమంత్రిగా కనిపిస్తాడు. ఇది ఫిక్స్. ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడులో ఎన్టీఆర్ రాజకీయాలు, ఆయన ముఖ్యమంత్రి అవడానికి కలిసొచ్చిన అంశాలు, రాజకీయ నేతలతో ఎన్టీఆర్ సంబంధాలు అన్ని చూయిస్తారనేది తెలిసిన విషయమే. అయితే బాలకృష్ణ ఈ మహానాయకుడి లోనే ముఖ్యమంత్రిగా కాకుండా ఆయన బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలోనూ ముఖ్యమంత్రిగా కనిపిస్తాడు అంటూ గత రెండు రోజులుగా ఒక న్యూస్ ఫిలింసర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతోంది.

ఎప్పటినుండో బోయపాటితో బాలయ్య చెయ్యబోయే సినిమా రాజకీయ నేపథ్యంలో ఉండబోతోందని.. 2019 ఎన్నికల టార్గెట్ గా ఈ సినిమా తెరకెక్కబోతుంది అంటూ ప్రచారం జరుగుతున్నవేళ.. బోయపాటి సినిమాలో ఒకపాత్రలో బాలకృష్ణ ముఖ్యమంత్రిగా కనబడతాడనే సరికి చాలామంది నమ్మేశారు. అయితే ఈ విషయాలు ఆ నోటా ఈ నోటా నుంచి బాలయ్య సినిమా స్క్రిప్ట్ మీద కూర్చున్న బోయపాటి చెవిన పడిందట. అసలే వినయ విధేయ రామ ప్లాప్ తో ఉన్న బోయపాటికి ఈ మేటర్ వినబడేసరికి కాస్త కోపం ఆశ్చర్యం కలిగాయట.

అందుకే.. ‘బాలకృష్ణగారి సినిమా రాజకీయ నేపథ్యంలో ఉంటుందని మీకెవరు చెప్పారు... అలాంటిదేం లేదు, బాలకృష్ణ గారితో చేయబోయే సినిమా.. నేను గతంలో చేసిన లెజెండ్, సింహ చిత్రాలకు మించి మాస్ మాసాలతోనే ఉంటుంది’ అని బోయపాటి సన్నిహితులకు చెప్పినట్టుగా వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం బోయపాటి - బాలయ్య కాంబో ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేని పరిస్థితి. ఏదో కథానాయకుడు ఈవెంట్‌లో ఫిబ్రవరి నుండి సెట్స్ మీదకెళుతుందని బాలయ్య చెప్పినా.. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించడం లేదు. ఎందుకంటే బాలయ్య కథానాయకుడు ప్లాప్ టెన్షన్‌లో మహానాయకుడు మీద ఫుల్ ఫోకస్ పెట్టాడు. మరోపక్క వినయ విధేయరామ ప్లాప్ తో బోయపాటి కాస్త టెన్షన్ లో ఉన్నాడు.

Balakrishna Cannot Be a CM:

Balakrishna Not Doing CM in Boyapati Srinu Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ