యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోయిన్ తల్లి కాబోతోంది. ఆమె మరెవరో కాదండోయ్ సమీరారెడ్డి. యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నటించిన `నరసింహుడు` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంటరైన ఈ రాజమండ్రి చిన్నది ఆ తరువాత దాదాపు ఐదు తెలుగు చిత్రాల్లో మెరిసింది. అప్పట్లో ఎన్టీఆర్‌తో సన్నిహితంగా మెలిగిన సమీరారెడ్డి తను గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్న మహారాష్ట్రకు చెందిన యువ వ్యాపార వేత్త అక్షయ్ వర్దేని 2014 జనవరిలో పెళ్లి చేసుకుంది. ఆ తరువాత ఏడాదే ఓ మగ పిల్లాడికి జన్మనిచ్చిన సమీరా మరోసారి తల్లికాబోతోంది.
మరో సారి తల్లికాబోతున్న సమీరా ఇటీవల బాంబేలో నిర్వహించిన లక్మే ఫ్యాషన్ వీక్ 2019లో తలుక్కున మెరిసింది. బేబీ బంప్‌తో వున్న సమీరాని చూసిన కెమెరా కళ్లు ఫ్లాష్‌లతో మెరవకుండా వుండలేకపోయాయి. ఎల్లో కలర్ డ్రెస్‌లో ఈ కార్యక్రమానికి వచ్చిన సమీరా తన బేబీ బంప్‌ని మాత్రం ఎవరి కంటనడకుండా దాయలేకపోయింది. అలీవ్ గ్రీన్ లాంగ్ కోట్‌లో, వైట్ టీషర్ట్, లాంగ్ బ్లాక్ గెగ్గిన్ ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమీరా కలర్‌ఫుల్‌గా కనిపించింది. అన్నట్టు సమీరా డెలివరీ డేట్‌ని కూడా డాక్టర్‌లు కన్‌ఫమ్ చేసేశారు. జూలై 1న సమీరారెడ్డి పండంటి పాపకి జన్మనివ్వబోతోంది. కన్నడ చిత్రం `వరదనాయక` తరువాత మరో సినిమాను అంగీకరించని సమీరా సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేసింది.