మెగా ఫ్యామిలీ ముచ్చట్లు అభిమానులతో పంచుకోవడానికి ఎప్పుడూ రెడీగా వుండే ఉపాసన ప్రస్తుతం సైలెంట్ గా కనబడుతుంది. మెగా ఫ్యామిలోని రామ్ చరణ్ ని పెళ్లాడిన తర్వాత ఉపాసన, రామ్ చరణ్ కబుర్ల దగ్గర నుండి ఫ్యామిలిలో ఏ చిన్న అకేషన్ జరిగినా.... అభిమానులకు సోషల్ మీడియా ద్వారా అందజేస్తుంది. అలాగే మహేష్ వైఫ్, బ్రాహ్మణి, ఎన్టీఆర్ ఫ్యామిలీతో రామ్ చరణ్ కి ఉన్న సాన్నిహిత్యం కూడా ఉపాసన ద్వారానే బయటికొచ్చింది. ఇక మిస్టర్ సి అలా.. మిస్టర్ సి ఇలా అంటూ సోషల్ మీడియాలో ఉపాసన పోస్ట్ లు పెడుతుండేది. రామ్ చరణ్ సోషల్ మీడియాలో అంతగా యాక్టీవ్ గా ఉండడు. అందుకే ఉపాసన ఎంత పెద్ద హోదాలో ఉన్నా.. చరణ్ విషయాలను అభిమానులకు కనెక్ట్ చేస్తూ ఉండేది.
అయితే రామ్ చరణ్ రంగస్థలం సినిమా అప్పటి నుండి రామ్ చరణ్ విషయాలను ఉపాసన ఎక్కువగా సోషల్ మీడియాలో ఉంచేది. అతను జిమ్ లో ఉన్నా, వంట చేసినా, ఏ డైట్ ఫాలో అవుతున్నాడా, చరణ్ బాడీ షేప్ ఇలా ఏ విషయాన్నీ అయినా ఉపాసన సోషల్ మీడియా వేదికగా హైలెట్ చేసేది. అందుకే రామ్ చరణ్ కి ఉపాసన గోస్ట్ పీఆర్వో అంటూ మీడియా మిత్రులు కామెంట్స్ కూడా చేశారు. మరి ఎప్పుడు చరణ్ విషయంలో యాక్టీవ్ గా ఉండే ఉపాసన ప్రస్తుతం చరణ్ విషయాలను బయటపెట్టడం లేదు. చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమా ఫలితం చూశాక ఉపాసన, రామ్ చరణ్ లు ఇద్దరు సైలెంట్ అయ్యారు. చరణ్ ముచ్చట్లు వదిలేసి ఉపాసన తన పని చూసుకుంటుంది.
అంటే తాను మైక్రోసాఫ్ట్ అధినేతలను కలిసిన విషయాలు అలాంటివి అన్నమాట. మరి రామ్ చరణ్ విషయాలను కాస్త పక్కన బెట్టినట్లుగా అనిపిస్తుంది. అది వినయ విధేయ రామ ఎఫెక్ట్ అనుకోవాల్సి వస్తుంది. వినయ విధేయ రామ హిట్ అయితే రామ్ చరణ్ ని సోషల్ మీడియాలో మళ్ళీ హీరోని చేసేది. మరి రామ్ చరణ్ తాజా చిత్రం RRR ముచ్చట్లతో ఉపాసన మళ్ళీ ఎప్పుడు తెర మీదకి వస్తుందా అని మెగా ఫ్యాన్స్ వెయిటింగ్.