Advertisementt

‘ఆర్‌ఎక్స్‌ 100’ బ్యూటీ అదరగొడుతుందిగా!

Sat 02nd Feb 2019 11:51 AM
payal rajput,heroine,movies,ravi teja,nagarjuna,bellamkonda srinivas  ‘ఆర్‌ఎక్స్‌ 100’ బ్యూటీ అదరగొడుతుందిగా!
Payal Rajput Busy with Movies ‘ఆర్‌ఎక్స్‌ 100’ బ్యూటీ అదరగొడుతుందిగా!
Advertisement
Ads by CJ

తెలుగులో ఇటీవల తమ బోల్డ్‌ యాక్టింగ్‌తో, అందాల ఆరబోత, లిప్‌లాక్‌లతో విపరీతమైన క్రేజ్‌ తెచ్చుకున్న కొత్త హీరోయిన్లు ఎవరంటే ‘అర్జున్‌రెడ్డి’లో నటించిన షాలినీ పాండే, ‘ఆర్‌ఎక్స్‌ 100’లో దుమ్మురేపి హద్దులే లేకుండా నటించిన పాయల్‌ రాజ్‌పుత్‌ల పేర్లే చెప్పాలి. ఇక పాయల్‌ రాజ్‌పుత్‌ ఒకే ఒక్క చిత్రంతో యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ తెచ్చుకోవడంతో ఆమెకి వరుస అవకాశాలు వెల్లువెత్తుతాయని పలువురు భావించారు. కానీ ఎందుకనో గానీ ఈమెకి ఇప్పటివరకు మరో మంచి అవకాశం రాలేదు. 

తాజాగా పాయల్‌కి రెండు మంచి అవకాశాలు వచ్చాయని తెలుస్తోంది. మాస్‌మహారాజా రవితేజ హీరోగా వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో రామ్‌ తాళ్లూరి నిర్మించే ‘డిస్కోరాజా’లో ఇప్పటికి ఈమెకి అవకాశం దక్కింది. అలాగే ప్రస్తుతం తేజ, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌-కాజల్‌లు జంటగా ‘సీత’ చిత్రం తీస్తున్నాడు. ఇందులో ఓ హాట్‌హాట్‌ ఐటం సాంగ్‌ ఉందిట. యూత్‌ హీరోలు, హీరోయిన్లను అద్భుతంగా చూపించి, వారికి స్టార్‌ స్టేటస్‌ ఇచ్చే దర్శకునిగా పేరున్న తేజ ఈ పాట కోసం పాయల్‌ రాజ్‌పుత్‌ని తీసుకున్నాడని సమాచారం. 

ఇక ముచ్చటగా మూడో అవకాశం మాత్రం ఆమెకి పెద్దమలుపు కానుంది. నాగార్జున పేరుకి సీనియర్‌ స్టారే అయినా ఆయన తన కుమారుల కంటే ఎక్కువ మన్మథునిగా కనిపిస్తాడు. ఈ వయసులో కూడా ఆయనతో నటించేందుకు యంగ్‌ హీరయిన్లు పోటీ పడుతుంటారు. ప్రస్తుతం నాగార్జున తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన ‘మన్మథుడు’ కి సీక్వెల్‌ చేయడానికి అంగీకరించాడు. నటుడి నుంచి దర్శకునిగా మారిన రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో ఈమూవీ రూపొందనుంది. ఇందులో నాగ్‌కి జోడీగా ఓ హీరోయిన్‌ పాత్ర కోసం రాహుల్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ని ఎంచుకున్నాడని సమాచారం. మరి ఈ రెండు ఓకే అయితే మొత్తంగా మూడు చిత్రాలతో పాయల్‌ తెలుగులో హల్‌చల్‌ చేయడం ఖాయమేనని చెప్పాలి...! 

Payal Rajput Busy with Movies:

2 good Offers to RX 100 Heroine Payal Rajput

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ