Advertisementt

‘మహర్షి’ హీరోయిన్ రెమ్యూనరేషన్ షాకిస్తోంది

Fri 01st Feb 2019 10:50 PM
pooja hegde,mahesh babu,maharshi,remuneration  ‘మహర్షి’ హీరోయిన్ రెమ్యూనరేషన్ షాకిస్తోంది
Shocking Remuneration to Maharshi Movie Heroine ‘మహర్షి’ హీరోయిన్ రెమ్యూనరేషన్ షాకిస్తోంది
Advertisement
Ads by CJ

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల పక్కన నటించే స్టార్ హీరోయిన్స్ కి బాగా కొరతగా ఉంది. అందుకే నలుగురు హీరోల పక్కన ఒకే హీరోయిన్ ని తీసుకోవాల్సి వస్తుంది. తాజాగా స్టార్ హీరోల పక్కన నటించేందుకు కేవలం ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ మాత్రమే దర్శక నిర్మాతలకు బెస్ట్ ఆప్షన్ గా కనబడుతున్నారు. వారిలో ఇప్పటికే డీజే భామ పూజాహెగ్డే ముగ్గురు స్టార్ హీరోలకు బుక్కైంది. మరో భామ కియారా ఒక హిట్టు, ఒక ప్లాపుతో తదుపరి టాలీవుడ్ ప్రాజెక్టుల విషయంలో ఆమె కెరీర్ డోలాయమానంలో ఉంది. ఇక రష్మిక, సాయి పల్లవి లాంటి వాళ్లు స్టార్ హీరోలకు ఆనడం లేదు. 

అయితే ప్రస్తుతం స్టార్ హీరోల పక్కన దూసుకుపోతున్న పూజాహెగ్డే అందరికన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా కనబడుతుంది. ఆమె ఒక్క సినిమాకి కోటి డెబ్భై లక్షలు పారితోషకం తీసుకుంటుంది. ఆమె నటించిన సినిమాలేమి బ్లాక్ బస్టర్ హిట్స్ కాకపోయినా.. పూజా ఆ రేంజ్ పారితోషకం అందుకోవడం గ్రేటే. ముకుంద, ఒక లైలా కోసం, డీజే, సాక్ష్యం సినిమాలు యావరేజ్ అయితే... అరవింద సమేత పర్లేదనిపించినా.. మహర్షి కోసం పూజాహెగ్డే కోటి డెబ్భై లక్షలు అందుకుంటుంది. అయితే మహర్షికి పూజా కాల్షీట్స్ ఎక్కువ అవసరం కనకనే ఈ రేంజ్ పారితోషకం అమ్మడు అందుకుంటుందట.

మహర్షి సినిమాలో పూజా కాల్షీట్స్ ఎప్పుడు బడితే అప్పుడు అవసరమవడం... అసలెన్ని కాల్షీట్స్ పడతాయో చెప్పలేకపోవడం వలెనే పూజాకి మహర్షి నిర్మాతలు అంత ఇచ్చుకుంటున్నారట. మరి మహర్షికి అందుకున్న హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ మిగతా సినిమాలకైతే వర్తించదంటున్నారు. తన మిగతా సినిమాలకు కోటి డెబ్భై ఇచ్చే సీన్ ఉండదని.. ప్రస్తుతం బ్లాక్ బస్టర్ లేని పూజాకి మహర్షి హిట్ అయితేనే మరిన్ని ఆఫర్స్ వస్తాయి కానీ... లేదంటే ఆమె ప్రభాస్ తో చేసే సినిమానే లాస్ట్ మూవీ అవుతుంది అంటూ కామెంట్స్ రేజ్ చేస్తున్నారు.

Shocking Remuneration to Maharshi Movie Heroine:

Pooja Hegde Takes 1.70 Crores for Maharshi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ