ఒకప్పుడు వారసుల కోసమే పెళ్లి చేసుకొనేవారు. ఆ తర్వాత తోడు కోసం పెళ్లి చేసుకోవడం మొదలెట్టారు. ఇప్పటి జనరేషన్ ఏమో ఏకంగా తోడు, పిల్లలు కావాలి కానీ పెళ్లి మాత్రం వద్దు అంటున్నారు. హాలీవుడ్ లో ఎప్పట్నుంచో ఫాలో అవుతున్న ఈ ప్రొసీజర్ ఇప్పుడిప్పుడే బాలీవుడ్ కి కూడా పాకింది. ఆల్రెడీ తుషార్ కపూర్ పెళ్లి అవ్వకుండానే పిల్లలకి తండ్రి అవ్వగా.. ఇప్పుడు అతడి అక్క ఏక్తా కపూర్ కూడా అదే తరహాలో తల్లయ్యింది. పోనీ సమాజం మీద ప్రేమతో పెళ్ళికి ముందే తల్లిదండ్రులవుతున్నారు కదా.. మరి పెళ్లి ఎప్పుడు అని అడిగితే మాత్రం ఆ ఆలోచన లేదు అంటూ ఖరాకండీగా చెప్పేస్తున్నారు.
తెలుగులో కూడా మంచు లక్ష్మీ సరోగసీ పద్ధతి ద్వారా గర్భం దాల్చకుండానే తల్లి అయిన విషయం తెలిసిందే. అయితే ఈమే పెళ్లి అయ్యాక ఇలా చేసింది కాబట్టి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ.. రాబోయే తరంలో జనాలు పెళ్లి అనేది మొత్తానికి పక్కన పెట్టేసి కేవలం కెరీర్, ఎప్పుడైనా ఒంటరి అని ఫీలింగ్ కలిగితే లివ్ ఇన్ రిలేషన్ షిప్స్, మనకంటూ ఎవరూ లేరు అనే భావన కలిగితే ఇలా పిల్లల గురించి ఆలోచిస్తారేమో.
ఎంత వద్దు అనుకున్నా కూడా.. ఈ పద్ధతి మన తెలుగు రాష్ట్రాల్లోనూ మొదలవ్వడం ఖాయం కాబట్టి, మరి ఈ పద్ధతిలో పెళ్లవ్వకుండానే పిల్లల్ని కానే తొలి టాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో చూడాలి.