ఇప్పటివరకూ ఎందుకు వర్కవుట్ అవ్వలేదో తెలియదు కానీ.. ఒకవేళ వర్కవుట్ అయితే మాత్రం క్రేజీయస్ట్ కాంబో ఆఫ్ ది డెకేడ్ గా చరిత్రపుటల్లో నిలవదగ్గ స్థాయి ఉన్న కాంబినేషన్ అది. అదే బాలకృష్ణ-రాంగోపాల్ వర్మల కాంబినేషన్. ఈ ఇద్దరి కలయికలో ఒక్క సినిమా కూడా రాలేదు కానీ.. వస్తే బాగుండు అని ప్రతి తెలుగు సినిమా అభిమాని కోరుకొంటాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందో లేదో తెలియదు కానీ.. వర్మ కెలుకుడికి బాలయ్య ఎక్కడ బీపీ వచ్చి కొడతాడో అని మాత్రం అనిపిస్తుంది.
అసలే ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేయాలో తెలియక.. షూటింగ్ ఇంకా పూర్తవ్వక, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అవ్వక చెడ్డ చిరాకులో ఉన్న బాలయ్యను కావాలనే కెలుకుతున్నాడు ఆర్జీవి. వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ ను ఎన్టీఆర్ మహానాయకుడు విడుదలైన రోజు రిలీజ్ చేద్దాం అనుకున్నాడట వర్మ, కానీ ఇప్పటివరకూ మహానాయకుడు రిలీజ్ డేట్ ను ఫైనల్ చేయకపోవడంతో నిన్న ఈ విషయమై ఒక ట్వీట్ వేశాడు వర్మ. ప్రస్తుతం ఆ ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది. మరి వర్మ కావాలనే కెలుకుతున్నాడో లేక పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నాడో తెలియదు కానీ.. నందమూరి అభిమానులు మాత్రం ఎప్పట్లానే వర్మ మీద నిప్పులు చెరుగుతున్నారు. వర్మ కూడా ఎప్పట్లానే ఆ తీట్లని పబ్లిసిటీ కోసం వాడేసుకొంటున్నాడు. ఏదేమైనా వర్మ కంటే ఎక్కువగా సీనియర్ ఎన్టీఆర్ మరియు బాలయ్య అభిమానులు మహానాయకుడు అఫీషియల్ రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.