బాలకృష్ణ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. ఎన్టీఆర్ పాత్రధారిగా బాలకృష్ణ మహానాయకుడిలో ముఖ్యమంత్రిగా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశాన్ని కథానాయకుడిలోనే చూపించిన క్రిష్ మహానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ సీఎం అయిన సన్నివేశాలను చూపిస్తాడు. ఇక మహానాయకుడు సినిమా ఫిబ్రవరి 22 న విడుదలయ్యే సూచనలు కనబడుతున్నాయి. తాజాగా బాలకృష్ణ మరో మూవీలో కూడా ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడనే న్యూస్ హాట్ టాపిక్ గా మరింది.
అది కూడా ఆయనకు సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో నటిస్తున్నాడు. బోయపాటి సినిమాల్లో బాలకృష్ణని ఎంత పవర్ ఫుల్ గా చూపిస్తాడో అనేది సింహ, లెజెండ్ చిత్రాల్లోనే చూశాం. ఇక ముచ్చటగా హ్యాట్రిక్ హిట్ కొట్టగానే కసితో మొదలుకాబోతున్న బోయపాటి - బాలయ్యల కాంబో చిత్రం 2019 ఎన్నికల టార్గెట్ గా తెరకెక్కుతోందని ప్రచారం ఉంది. తాజాగా బోయపాటి ఈ సినిమాలో బాలకృష్ణని పవర్ ఫుల్ ముఖ్యమంత్రిగా చూపించబోతున్నాడట. సింహ, లెజెండ్ చిత్రాలు తరహాలోనే.. బోయపాటి ఈ చిత్రంలోనూ బాలయ్యను రెండు తరహా పాత్రల్లోనే చూపించబోతున్నాడట.
అయితే అందులోని ఒక పాత్రలో బాలకృష్ణ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నాడని అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ఈ చిత్రం ఫిబ్రవరి నెలాఖరులో మొదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.