Advertisementt

ఒకే ఒక్క హిట్టు.. జనవరి పరిస్థితి ఇది!

Thu 31st Jan 2019 08:47 PM
venkatesh,varun tej,f2,hit,january 2019  ఒకే ఒక్క హిట్టు.. జనవరి పరిస్థితి ఇది!
Only one Hit in January at Tollywood ఒకే ఒక్క హిట్టు.. జనవరి పరిస్థితి ఇది!
Advertisement
Ads by CJ

2019 మొదలైంది.. అప్పుడే 2019 జనవరి నెల చివరిలో కొచ్చేసింది. ఈ ఏడాది ప్రథమార్ధంలో సంక్రాంతి పండగ స్పెషల్ గా విడుదలవుతున్న సినిమాలకు భయపడి.. జనవరి మొదటి వారంలో ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఇక సంక్రాంతికి పొలోమంటూ మూడు తెలుగు సినిమాలు, ఒక తమిళ సినిమా రోజుకొకటి చొప్పున విడుదలయ్యాయి. ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు జనవరి 9 న, రామ్ చరణ్ వినయ విధేయరామ జనవరి 11 న, తమిళ పేట మూవీ జనవరి 10 న, వెంకీ - వరుణ్ ల ఎఫ్ 2 జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఆ సినిమాల దెబ్బకి మూడో వారంలో అంటే జనవరి మూడో వారంలో ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఇక సంక్రాంతి ఫలితాలతో పనేమిలేదన్నట్టుగా జనవరి చివరి వారంలో అంటే మొన్న శుక్రవారం ఒక తెలుగు సినిమా.. మరో హిందీ డబ్బింగ్ మూవీ విడుదలయ్యాయి. ఇక తెలుగులో అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను, హిందీలో కంగనా మణికర్ణిక ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక జనవరి నెల ముగిసిపోయింది.

ఇక జనవరి నెలలో విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు టాక్ సూపర్.. కలెక్షన్స్ నిల్. ఇక రామ్ చరణ్ వినయ విధేయరామ టాక్ నెగెటివ్.. కలెక్షన్స్ డల్ కానీ.. పర్లేదు. ఇక పేట అట్టర్ ప్లాప్. అయితే ఈ మూడు పెద్ద సినిమాల మధ్యలో వచ్చిన పిల్ల సినిమా అదేనండి ఎఫ్ 2 మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కథానాయకుడులో కంటెంట్ లేకపోవడం, వినయ విధేయ రామలో ఫ్యామిలీ డ్రామా అండ్ కామెడీ లేకపోవడం.. పేట కథ లేకపోవడంతో... ప్లాప్ అవగా.. ఎఫ్ 2 కామెడీ హిట్ గా నిలిచింది. ఆ సినిమా ఇప్పడు స్టార్ హీరోల సినెమాలకొచ్చే కలెక్షన్స్ కొల్లగొడుతూ నిత్యం వార్తల్లోనే ఉంటుంది.

ఇక గత శుక్రవారం అంటే జనవరి చివరిలో సోలో గా దిగిన అఖిల్ మిస్టర్ మజ్ను డిజాస్టర్ దిశగా పరుగులు పెడుతుంది. అఖిల్ - వెంకీ అట్లూరిల కాంబోలో వచ్చిన మిస్టర్ మజ్ను టాక్ వీక్ - కలెక్షన్స్ వీక్. ఇక బాలీవుడ్ మణికర్ణిక కూడా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. మరి ఈ జనవరిలో కేవలం ఎఫ్ 2 మాత్రమే హిట్ అయ్యి.. మిగతావన్నీ తొంగున్నాయి. మరి ఈ నెల ఇలా ఉంటే.. వచ్చే ఫిబ్రవరి పరిస్థితి ఏమిటో చూడాలి.

Only one Hit in January at Tollywood:

F2 Get First Success in 2019

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ