Advertisementt

పూరీ కన్ను.. ‘2.ఓ’ విలన్‌పై పడింది

Thu 31st Jan 2019 02:22 PM
sudhanshu pandey,villain,puri jagannadh,ram,ismart shankar  పూరీ కన్ను.. ‘2.ఓ’ విలన్‌పై పడింది
2.O Villain in Puri Ismart Shankar పూరీ కన్ను.. ‘2.ఓ’ విలన్‌పై పడింది
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో పూరీ జగన్నాథ్‌ వేగంగా చిత్రాలు తీయడంలోనే కాదు.. ఎందరో హీరోయిన్లను, విలన్లను తెలుగువారికి పరిచయం చేశాడు. జయాపజయాలు పక్కనపెడితే ఆయన పరిచయం చేసిన విలన్లు, హీరోయిన్లు ఆ తర్వాత స్టార్‌ స్టేటస్‌ సాధించారు. ప్రస్తుతం పూరీకి బ్యాడ్‌టైం నడుస్తోంది. అదే సమయంలో ఆయన పరిచయం చేసిన విలన్లు, హీరోయిన్లు కూడా పూరి ఒక్క చిత్రానికే పరిమితం అవుతున్నారు గానీ వరస అవకాశాలు సాధించడంలో విఫలం చెందుతున్నారు. 

ప్రస్తుతం పూరీ, రామ్‌ హీరోగా ‘ఇస్మాత్ శంకర్‌’ చిత్రం ప్రారంభించాడు. చిత్రం షూటింగ్‌ కూడా మొదలైంది. ‘సవ్యసాచి, మిస్టర్‌ మజ్ను’ చిత్రాలలో నటించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నిధి అగర్వాల్‌ని హీరోయిన్‌గా సెలక్ట్‌ చేసుకుని షాక్‌ ఇచ్చాడు. ఎదురు రెమ్యూనరేషన్‌ ఇచ్చి నటించిందా? అనే విమర్శలను ఈ కన్నడ భామ ఎదుర్కొంది. 

మరి ఈమె పూరీ చేతిలో పడి అయినా రక్షిత, ఆసిన్‌, అనుష్క, అమలాపాల్‌ వంటి వారిలా రాణిస్తుందా? అనేది వేచిచూడాలి. ఇక ఇందులో విలన్‌గా పూరీ బాలీవుడ్‌ స్టైలిష్‌ విలన్‌ సుదాన్షు పాండేని ఎంపిక చేశాడు. ఇటీవలే ఆయన ‘2,.ఓ’లో నటించాడు. మరి ఈయన కూడా సోనూసూద్‌ అంత ఎత్తుకు ఎదగాలని ఆశిద్దాం....!

2.O Villain in Puri Ismart Shankar:

Sudhanshu Pandey Villain in Puri and Ram Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ