హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం వాల్మీకి. రీసెంట్ గా ఓపెనింగ్ జరుపుకుని త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న టైములో చిక్కుల్లో పడింది. ఈసినిమా యొక్క టైటిల్ పై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు . వాల్మీకి టైటిల్ ను ఇటువంటి ఎంటర్ టైన్ మెంట్ సినిమాకు వాడటం ఏంటంటూ వాల్మీకి సామాజిక వర్గంకు చెందిన సాయిప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.
సినిమా టైటిల్ లోగోలో గన్ ఉందని... ఈచిత్రంలో మమ్ములని హింసను ప్రేరేపించే వారిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని, తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా సినిమా ఉంటే మేము షూటింగ్ జరగకుండా ఆపుతామని చెప్పారు. వెంటనే టైటిల్ తో పాటు సినిమాలో వాల్మీకి అనే టైటిల్ ని కూడా తీసేయాలని ఆయన హెచ్చరించాడు.
రామాయణంను రాసిన వాల్మీకి పేరుతో ఇలాంటి హింసాత్మక సినిమాలు తీయడంను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని సంఘం నాయకులు అంటున్నారు. తమను ఇందులో ఫ్యాక్షనిస్టులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని.. వెంటనే టైటిల్ మార్చకుంటే మాత్రం సీరియస్ చర్యలు ఉంటాయని దర్శకుడు హరీష్ శంకర్ ను సాయిప్రసాద్ హెచ్చరించాడు. అయితే దీనిపై అటు నిర్మాత కానీ, ఇటు డైరెక్టర్ హరీష్ శంకర్ కానీ రెస్పాండ్ అవ్వలేదు.