మహా అయితే తన తోటి సింగర్స్ మరియు తనకు అవకాశం ఇవ్వని మ్యూజిక్ డైరెక్టర్స్ మీద కామెంట్ చేశారు తప్పితే.. ఇప్పటివరకూ సీనియర్ మోస్ట్ సింగర్ ఎస్పీ బాలు ఇండస్ట్రీ మీద కానీ ఇండస్ట్రీ వ్యవహారశైలి మీద కానీ కామెంట్ చేసిన దాఖలాలు లేవు. అలాంటి బాలసుబ్రమణ్యానికి కూడా మన హీరోయిన్లు టెంపర్ లేచేలా చేశారు. రీసెంట్ గా ఒక సభకు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎస్పీ బాలు ప్రెజంట్ హీరోయిన్లు ఆడియో ఫంక్షన్స్ కు, పబ్లిక్ ఈవెంట్స్ కు వస్తున్న విధానాన్ని తప్పుబట్టడమే కాక వెటకారం చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖలు ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తున్నాయి.
ప్రెజంట్ జనరేషన్ హీరోయిన్స్ అందరూ హీరోలను ఇంప్రెస్ చేయడం కోసం కురచ దుస్తులు వేసుకొని ఫంక్షన్స్ కి అటెండ్ అవుతున్నారు, అక్కడికి ఏదో అలాంటి బట్టలు వేసుకోకపోతే అవకాశాలు రావు అన్నట్లే బిహేవ్ చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు. అక్కడున్నవాళ్ళందరూ ఎస్పీ బాలు చెప్పిన మాటలకి సరదాగా నవ్వినప్పటికీ.. ఆయన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. బాలసుబ్రమణ్యం అంతటితో ఆగలేదు న్యాయవ్యవస్థ మరియు ప్రభుత్వాల పనితీరుపై ఇష్టాగోష్టి మాట్లాడారు. అయితే.. ఆ విషయాలన్నిటికంటే ఈ హీరోయిన్స్ డ్రెస్సింగ్ మీద వేసిన కామెంట్స్ మాత్రం బాగా హైలైట్ అయ్యాయి.