Advertisementt

చిరంజీవి కూడా ఆదుకోలేదంట..!

Wed 30th Jan 2019 08:47 AM
fight master,raju,wife,allegations,megastar,chiranjeevi  చిరంజీవి కూడా ఆదుకోలేదంట..!
Fight Master Raju Wife Sensational Comments on Tollywood చిరంజీవి కూడా ఆదుకోలేదంట..!
Advertisement
Ads by CJ

కాస్త రామ్‌చరణ్‌ ఓ స్థాయికి వచ్చి తమ సొంత బేనర్‌గా ‘కొణిదెల ప్రొడక్షన్స్‌’ని స్థాపించాడు కాబట్టి ‘ఖైదీనెంబర్‌150’.. ప్రస్తుతం ‘సైరా..నరసింహారెడ్డి’, త్వరలో మ్యాట్నీ సంస్థతో కలిసి కొరటాల శివ చిత్రాలు కొణిదెల బేనర్‌లోనే నిర్మితం అవుతున్నాయి. కానీ అంతకు ముందు మాత్రం చిరంజీవితో భారీ బడ్జెట్‌, అంచనాలున్న చిత్రాలను నిర్మించాలంటే కేవలం అల్లుఅరవింద్‌, గీతాఆర్ట్స్‌ సంస్థల పేర్లే వినిపించేవి. నిజానికి మెగా కాంపౌండ్‌ మొత్తం రైలు బండి వంటిదైతే మెగాస్టార్‌ చిరంజీవి దానికి ఇంజన్‌ వంటివాడు. కానీ డ్రైవర్‌ మాత్రం అల్లూ వారే. 

ఎంతోకాలం సినిమాలలోనే కాదు.. రాజకీయ ప్రవేశం, ప్రజారాజ్యం పార్టీ స్థాపన, దానిని కాంగ్రెస్‌లో విలీనం చేయడం వంటివన్నీ అల్లు కనుసన్నల్లోనే నడిచాయనేది వాస్తవం. నాడు పార్టీలోకి ఎవరిని చేర్చుకోవాలన్నా, ఎవరెవ్వరికి సీటు ఇవ్వాలన్నా అల్లు వారి మాటే చెల్లుబాటు అయ్యేది. ఇదే విషయంలో ఇటీవల పవన్‌కళ్యాణ్‌ తనని ప్రచారంకి అవసరం లేదని అల్లు చెప్పిన మాటను గుర్తు చేశారు. ఇక అల్లుఅర్జున్‌కి స్టార్‌స్టేటస్‌ వచ్చే వరకు మెగా కార్డ్‌ని ఉపయోగించి, తర్వాత బన్నీని సొంత బలంతో నిలబడేట్టు చేయడం అల్లు స్ట్రాటర్జీ అని, ‘చెప్పను బ్రదర్‌’ అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా అరవింద్‌ మౌనంగానే ఉన్నాడు గానీ బన్నీ చేత సారీ కూడా చెప్పించలేదనే అపవాదు ఉంది. 

ఇక చిరంజీవికి కెరీర్‌ మొదట్లో ఎంతో అండగా నిలిచి, ఎన్టీఆర్‌ తర్వాత తాను కేవలం చిరంజీవితోనే సినిమాలు తీస్తానని ప్రకటించిన దేవివరప్రసాద్‌ ‘మృగరాజు’తో ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయినా, జయకృష్ణ, కోడిరామకృష్ణ, రవిరాజా పినిశెట్టి, కోదండరామిరెడ్డి, కె.యస్‌.రామారావులతో పాటు చిరుకి ప్రాణస్నేహితులైన పిచ్చకొట్టుడు సుధాకర్‌, హరిబాబు, ప్రసాద్‌బాబు, నారాయణరావు వంటి వారిని కూడా చిరు నుంచి దూరం పెట్టడంలో అల్లుఅరవింద్‌ ప్రమేయం ఉందనేది వాస్తవం. ఎందుకంటే పలు ఇంటర్వ్యూలలో వారు ‘ఆ పొట్టివాడు’ (అల్లుఅరవింద్‌) వల్లనే చిరుకి తమకి దూరం పెరిగిందని ఆఫ్‌ది రికార్డు చెప్పేవారు.

ఇక రవిరాజా పినిశెట్టి, కోదండరామిరెడ్డి, కె.యస్‌.రామారావు వంటి వారి తనయులు హీరోలుగా తెలుగులో పరిచయం అయినప్పుడు చిరు నుంచి మెగా ఫ్యామిలీ నుంచి ప్రమోషన్స్‌ ఆశించారు. మెగాభిమానుల అండతో తమ కుమారులు తెలుగులో కుదురుకోవాలని భావించారు. కానీ అది వీలు కాలేదు. ఇక చిరంజీవి మొదటి నాళ్లలో ఆయన హీరోగా నిలబడేందుకు ఆయన డ్యాన్స్‌లు, ఫైట్స్‌ కారణమయ్యాయి. ఇక చిరుకి ఫైట్స్‌లో శిక్షణ ఇచ్చిన స్వర్గీయ రాజు మాస్టర్‌నిగానీ, డ్యాన్స్‌లలో శిక్షణ ఇచ్చిన సలీం వంటి వారిని కూడా ఆ తర్వాత చిరు పట్టించుకోలేదట. ఇక ఫైట్‌ మాస్టర్‌ రాజు సతీమణి అనంతలక్ష్మి తాజాగా వేటపాలెంలో జరిగిన ఆయన 67వ జయంతి వేడుకల్లో ఇదే విషయం చెప్పి ఉద్వేగానికి లోనుకావడం చర్చనీయాంశం అయింది.

Fight Master Raju Wife Sensational Comments on Tollywood:

Fight Master Raju Wife Allegations on MegaStar Chiranjeevi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ