సాయికృష్ణా ఫిలింస్ ద్వారా ఫిబ్రవరి 8న తెలుగులో శివకార్తికేయన్ ‘సీమరాజా’ విడుదల
రెమో వంటి లవ్ ఎంటర్‌టైనర్‌లో అద్బుతంగా నటించి తెలుగు ప్రేక్షకులందరి ప్రశంశలు పొందిన శివకార్తికేయన్ హీరోగా, సమంత, కీర్తిసురేష్‌లు హీరోయిన్స్‌గా తమిళంలో ప్రముఖ నిర్మాత ఆర్.డి.రాజా 24ఏమ్ స్టూడియెస్ బ్యానర్‌లో నిర్మించిన చిత్రం ‘సీమరాజా’. ఈ చిత్రం తమిళంలో విడుదలై కమర్షియల్‌గా చాలా మంచి సక్సెస్‌ని సాధించింది. ఈ చిత్రానికి పోన్రమ్ దర్శకుడు. ఈ చిత్రాన్ని గతంలో చాలా చిత్రాలు డిస్ట్రిబ్యూషన్, నిర్మాణం చేసిన ప్రముఖ నిర్మాత సాయికృష్ణ పెండ్యాల సాయికృష్ణా ఫిలింస్ ద్వారా తెలుగులో అనువాదం చేశారు. లక్ష్మి పెండ్యాల సమర్పిస్తున్న ఈ సీమరాజాని ఫిబ్రవరి 8న తెలుగులో విడుదల చేస్తున్నారు. డి.ఇమ్మాన్ సంగీతాన్ని అందించారు.
ఈ సందర్భంగా నిర్మాత సాయికృష్ణా పెండ్యాల మాట్లాడుతూ.. ‘‘రెమో చిత్రం థియేటర్స్‌లో ఎవరేజ్‌గా ఆడింది కానీ టీవీలో మాత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఎప్పుడు ఆ చిత్రం వచ్చినా కూడా ఫ్యామిలీ అంతా కలిసి చూస్తూ ఎంజాయ్ చేస్తారు. ఆ చిత్రంతో శివకార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరయ్యాడు. రెమో తరువాత తెలుగులో శివకార్తికేయన్ నటించిన సీమరాజా ఫిబ్రవరి 8 న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని సాయికృష్ణా ఫిలింస్ బ్యానర్ ద్వారా తెలుగులో విడుదల చేస్తున్నాము. రెండు ఊర్ల మధ్య జరిగే పక్కా కమర్షియల్ చిత్రం ఈ సీమరాజా. తమళంలో బి, సి సెంటర్స్‌లో కలెక్షన్లు దుమ్మురేపింది. సీమరాజాగా శివకార్తికేయన్ నటనకి మాస్ ఆడియన్స్ విజిల్స్ పడటం ఖాయం. తమిళంలో లాగా తెలుగులో కూడా కమర్షియల్‌గా పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాము. అతి త్వరలో మ్యూజిక్‌ని విడుదల చేస్తాము. లక్ష్మి పెండ్యాల సమర్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో ఆర్.డి.రాజా నిర్మించారు. సమంత చాలా మంచి పాత్రలో నటించింది. ఫిబ్రవరి 8న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము..’’ అని అన్నారు.
దర్శకత్వం: పోన్రమ్
నిర్మాత: సాయికృష్ణ పెండ్యాల
సమర్ఫణ: లక్ష్మి పెండ్యాల
సంగీతం: డి.ఇమ్మాన్
డిజైనర్: ఈశ్వర్