Advertisementt

‘సీత’లో ఐటమ్‌సాంగ్‌కి ఫిక్సయింది

Wed 30th Jan 2019 12:53 AM
seetha,item song,payal rajput,teja,kajal,payal rajput heroine,rx 100 fame  ‘సీత’లో ఐటమ్‌సాంగ్‌కి ఫిక్సయింది
Heroine Fixed for Seetha Movie Item song ‘సీత’లో ఐటమ్‌సాంగ్‌కి ఫిక్సయింది
Advertisement
Ads by CJ

సినిమా రిజల్ట్స్‌తో సంబంధం లేకుండా వరస సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్. తన సినిమాల్లో ఐటెం సాంగ్స్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు డైరెక్టర్స్. శ్రీనివాస్ మొదటి సినిమా నుండి ఐటెం సాంగ్స్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ‘అల్లుడు శీను’, ‘స్పీడున్నోడు’ సినిమాల్లో తమన్నా, ‘జయ జానకి నాయక’లో కేథరిన్ సందడి చేశారు.

మళ్లీ ఇప్పుడు మరోసారి ఐటెం సాంగ్ తో సందడి చేయనున్నాడు శ్రీనివాస్. ప్రస్తుతం తేజ డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘సీత’ అనే సినిమాలో శ్రీనివాస్‌కి జోడిగా కాజల్ నటిస్తుంది. రెండో హీరోయిన్‌గా మన్నారా చోప్రా నటిస్తుంది. రీసెంట్ గా గణతంత్ర దినోత్సవం నాడు ఈ సినిమా యొక్క టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

అయితే ఇందులో ఐటెం సాంగ్ లో పాయల్ రాజ్‌పుత్ సందడి చేయనుంది. ‘ఆర్.ఎక్స్.100’తో క్రేజ్ తెచ్చుకున్న ఈ భామతో సాయి శ్రీనివాస్ స్టెప్పులు వేయనున్నాడు. త్వరలోనే ఈ సాంగ్ షూట్ చేయనున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సమ్మర్‌లో రిలీజ్ కానుంది.

Heroine Fixed for Seetha Movie Item song:

Payal Rajput Selected for Seetha Movie Item Song

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ