Advertisementt

‘వజ్ర కవచధర గోవింద’ ఫ‌స్ట్ లుక్

Mon 28th Jan 2019 12:10 PM
saptagiri,vajra kavahcadhara govinda,first look,released  ‘వజ్ర కవచధర గోవింద’ ఫ‌స్ట్ లుక్
Vajra Kavahcadhara Govinda First Look ‘వజ్ర కవచధర గోవింద’ ఫ‌స్ట్ లుక్
Advertisement
Ads by CJ

సప్తగిరి హీరోగా తెర‌కెక్కుతోన్న‌ ‘వజ్ర కవచధర గోవింద’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

అత‌ని పేరు గోవిందు.  ఫన్నీ దొంగ. అత‌నికో లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్య సాధన కోసం ఏం చేశాడన్నది తెలుసుకోవాలంటే ‘వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర గోవింద‌’ సినిమా చూడాల్సిందే అని అంటున్నారు స‌ప్తగిరి. స్టార్ క‌మెడియ‌న్ స‌ప్త‌గిరి ఫ‌న్నీ దొంగ‌గా న‌టిస్తున్న సినిమా ‘వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర గోవింద‌’.  ఈ సినిమాకు అరుణ్ ప‌వార్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా

చిత్ర ద‌ర్శ‌కుడు అరుణ్ ప‌వార్ మాట్లాడుతూ... ‘‘నా ద‌ర్శ‌క‌త్వంలో స‌ప్త‌గిరి హీరోగా న‌టించిన ‘స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్‌’ విడుద‌లై ఎంత పెద్ద విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిందే.  తాజాగా రూపొందిస్తున్న ‘వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర గోవింద‌’ అంత‌కు మించి స‌క్సెస్ కావాల‌నే త‌ప‌న‌తో కృషి చేస్తున్నాం. సినిమా చాలా బాగా వ‌స్తోంది. స‌ప్త‌గిరి నుంచి ప్రేక్ష‌కులు ఏం ఆశిస్తారో, ఆ అంశాల‌న్నీ మా సినిమాలో ఉంటాయి. సప్తగిరి వ్యవ‌హారిక శైలికి పర్‌ఫెక్ట్‌గా సూటయ్యే కథ ఇది. మా క‌థ‌కు అనుగుణంగానే ప‌వ‌ర్‌ఫుల్‌గా ‘వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర గోవింద‌’ అనే టైటిల్‌ పెట్టాం. మా నిర్మాత‌లు కొత్త‌వారైనా ఎక్క‌డా కాంప్రమైజ్ కాకుండా సినిమా రూపొందిస్తున్నారు. కడుపుబ్బా నవ్వించే అంశాలతోపాటు, మంచి యాక్షన్, ఎమోషన్, ఇతర వాణిజ్య అంశాలు మెండుగా ఉంటాయి.’’ అని అన్నారు.

నిర్మాత‌లు  నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి మాట్లాడుతూ... ‘‘మా ‘వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర గోవింద‌’ షూటింగ్ 80 శాతం పూర్త‌యింది. మిగిలిన స‌న్నివేశాల‌ను  కర్ణాటకలోని ఒక గుడిలో  తెర‌కెక్కిస్తాం. మా చిత్రానికి చాలా కీల‌క‌మైన ఎపిసోడ్స్ ని 10 రోజుల పాటు ఈ దేవాలయంలో చిత్రీక‌రిస్తాం. మా చిత్ర టైటిల్‌కి ఎక్స్ ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది.  టైటిల్‌ ప్ర‌క‌టించ‌గానే మా సినిమాపై ఇండ‌స్ట్రీలోనూ, ప్రేక్ష‌కుల్లోనూ అటెన్ష‌న్ బాగా పెరిగింది. ‘స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్‌’ లాంటి సూపర్ హిట్ తర్వాత సప్తగిరి, అరుణ్ పవార్ కాంబినేషన్‌లో సినిమా చేసే అవకాశం మాకు దక్కడం చాలా హ్యాపీగా ఉంది.  హిలేరియస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్ర‌మిది’’ అని తెలిపారు.

వైభవీ జోషీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అర్చనా వేద, టెంపర్ వంశీ, అప్పారావు, అవినాష్, రాజేంద్ర జాన్ కొట్టోలి, వీరేన్ తంబిదొరై తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు . ఈ చిత్రానికి  కథ: జి టి ఆర్ మహేంద్ర, సంగీతం: విజయ్ బుల్గానిన్, కెమెరా: ప్రవీణ్ వనమాలి, ఎడిటింగ్: కిషోర్ మద్దాలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సలాన బాలగోపాలరావు, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: అరుణ్ పవార్.

Vajra Kavahcadhara Govinda First Look:

Saptagiri Movie Vajra Kavahcadhara Govinda First Look Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ