Advertisementt

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 హోస్ట్ ఈ హీరోనేనా?

Sun 27th Jan 2019 01:20 PM
ntr,bigg boss,telugu,season 3,details  బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 హోస్ట్ ఈ హీరోనేనా?
Bigg Boss Season 3 Host Details బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 హోస్ట్ ఈ హీరోనేనా?
Advertisement
Ads by CJ

బిగ్‌బాస్ షో హిందీ తర్వాత తెలుగులోనే అంత పాపులర్ అయింది. తెలుగులో మొదటి సీజన్‌ని హోస్ట్ చేసి పైన కూర్చోపెట్టిన ఎన్టీఆర్ సెకండ్ సీజన్ చేయలేకపోయాడు. నాని రంగం ప్రవేశం చేసినా షో కి అంత క్రేజ్ రాలేదు. ఎన్నో సమస్యలు, ఎన్నో ట్రోల్స్ మధ్య సెకండ్ సీజన్ ముగిసింది. 

ఇక మూడో సీజన్‌ని కూడా త్వరలోనే స్టార్ట్ చేయనున్నారు. అయితే హోస్ట్ ఎవరు అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. వెంకటేష్ అన్నారు కానీ ఆయన చేయనని చెప్పేశాడని టాక్. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సీజన్ 3 కోసం ఎన్టీఆర్‌ను సంప్రదించినట్టు టాక్. ఆయన కూడా సూత్ర ప్రాయంగా అంగీకరించారని భోగట్టా.

స్టార్ గ్రూప్ రీసెంట్‌గా డిస్నీగ్రూప్ చేతుల్లోకి వెళ్లిపోయింది. దాంతో పాటే మాటీవీ కూడా. అందువలన మరింత పకడ్బందీగా సీజన్ 3 చేయాలనే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మరి ఎన్టీఆర్ ఓకే చేస్తే ఎప్పుడూ చేస్తాడనేది అసలు సమస్య. ఆర్ఆర్ఆర్ సినిమా షెడ్యూళ్ల గ్యాప్‌లో చేసే ఆలోచనలు సాగుతున్నాయి. మరి రాజమౌళి తన షూటింగ్‌లో ఉండగా ఆయన హీరోస్ మరో వాటిపైన ఫోకస్ చేయడం ఇష్టం ఉండదు. మరి ఎన్టీఆర్.. రాజమౌళికి ఏం చెప్పి బిగ్ బాస్ చేస్తాడు అనేది చూడాలి. ఎన్టీఆర్ అందుకు తగ్గట్టు భారీ రెమ్యూనరేషన్‌నే ఆఫర్ చేసాడని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Bigg Boss Season 3 Host Details:

NTR is The Bigg Boss Telugu season 3

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ