Advertisementt

తమ్ముడూ.. ఈ భామకి హిట్టివ్వలే..!

Sat 26th Jan 2019 11:09 PM
nidhi agarwal,miss,hit,akkineni brothers  తమ్ముడూ.. ఈ భామకి హిట్టివ్వలే..!
Heroine Waiting for Hit తమ్ముడూ.. ఈ భామకి హిట్టివ్వలే..!
Advertisement
Ads by CJ

బాలీవుడ్ నుండి చందు మొండేటి, నాగ చైతన్య ‘సవ్యసాచి’ కోసం నిధి అగర్వాల్‌ని హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయం చేసాడు. నిధి అగర్వాల్ స్పైసీ లుక్స్‌తో ఆకర్షణతో కనబడేసరికి.. సవ్యసాచితో హిట్ కొడితే అమ్మడు ఫెట్ మారిపోతుంది అనుకునేలోపు.. టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్ అవుతుందననుకుంటుండగా... అక్కినేని అఖిల్.. అన్న చైతు సినిమాలో నటిస్తున్న నిధి అగర్వాల్‌ని చూసి ఆమె నటిస్తున్న సవ్యసాచి విడుదలకాకముందే తన మూడో సినిమాలో హీరోయిన్ గా అవకాశమిచ్చాడు. మరి సవ్యసాచిలో నిధి అగర్వాల్ అందాల ఆరబోత, హాట్ హాట్ గ్లామర్ లుక్స్ ఆకట్టుకున్నప్పటికీ.. ఆమెకు నటనలో పెద్దగా మెళుకువలు తెలియకపోవడంతో పాటుగా.. సవ్యసాచిలో ఓ అన్నంత ప్రాధాన్యమైన పాత్రలో నిధి నటించకపోవడంతో పాటుగా.. ఆ మూవీ డిజాస్టర్ అవడంతో.. పాపం నిధికి.. అన్న చైతూ నుంచి ప్లాపే మిగిలింది.. కనీసం తమ్ముడైనా హిట్ ఇస్తాడో లేదో అన్నారు.

తాజాగా నిధి - అఖిల్ అక్కినేని నటించిన మిస్టర్ మజ్ను శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాలోనూ నిధి అగర్వాల్ హాట్ యాంగిల్ లో రెచ్చిపోయింది. కానీ నటనలో ఇంకా మెరుగుపడాల్సి ఉంది అని అన్నారు విమర్శకులు. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ మాత్రం తన వీకెస్ట్ పెర్ఫార్మెన్స్‌ పుణ్యమా అని ఎక్కడా ఇంప్రెస్ చెయ్యలేకపోయిందని... సాయిపల్లవి లాంటి హీరోయిన్స్ బ్రిలియెంట్ పెర్ఫార్మెన్స్ చూస్తూ ఉన్న ప్రేక్షకులు ఇలాంటి హీరోయిన్స్‌ని యాక్సెప్ట్ చేయడం కష్టమే అంటూ ఒకరంటే... డైరెక్టర్ కూడా నిధి అగర్వాల్ క్యారెక్టర్‌ని కరెక్ట్‌గా డిజైన్ చేయలేకపోయాడని... అఖిల్ పక్కన నటనలో మెళుకువలు, సీనియర్ నటి నటించి ఉంటే.. ముదురు అనిపించే ప్రమాదం వుందని.. ఇప్పుడిప్పులే నటనలో ఓనమాలు దిద్దుతున్న.. లేత అందాలున్న నిధిని తీసుకున్నట్టున్నారు.

అయితే మిస్టర్ మజ్నులో నిక్కీ పాత్రని పండించడానికి అనుభవం చాలా అవసరం. లేదంటే కనీసం అభినయం తెలిసిన నటి అయినా కీలకం. అందుకే నటనలో ఏం తెలియని నిధి అగర్వాల్ చాలా సన్నివేశాల్లో తేలిపోయింది. అసలీ మిస్టర్ మజ్నులో నిధి అగర్వాల్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. పాత్రకు సెట్టయింది కానీ.. ఆమె ప్రత్యేకత అంటూ ఏమీ కనిపించదు అని మరొకరు నిధి అగర్వాల్ మిస్టర్ మజ్నులోని నటన గురించి చెప్పిన మాటలు. మరి నిధికి అన్న నాగ చైతన్య, తమ్ముడు అఖిల్ కూడా సూపర్ హిట్ ఇవ్వలేకపోయారు. పాపం నిధి అనాలనిపిస్తుంది కదూ..! 

Heroine Waiting for Hit:

Nidhi Agarwal missed hit with Akkineni Brothers

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ