టాలీవుడ్‌లో సినిమా జయాపజయాలకు అతీతంగా ఓపెనింగ్స్‌తోనే సగం పెట్టుబడిని లాగేసే స్టార్స్‌లో పవన్‌కళ్యాణ్ తర్వాత మహేష్‌బాబునే చెప్పాలి. కానీ ఈయన ‘బ్రహ్మోత్సవం, స్పైడర్’ చిత్రాలు ఆ మ్యాజిక్‌ని చేయలేకపోయాయి. కానీ మరలా ఆయన భరత్ అనే నేను తో శ్రీమంతుడు తర్వాత కొరటాల శివతో మరోసారి జతకట్టి భేష్ అనిపించుకున్నాడు. ఈ చిత్రం రంగస్థలం, నా పేరు సూర్య...నా ఇల్లు ఇండియా వంటి చిత్రాల పోటీలో వచ్చినప్పటికీ బాగా హిట్ అయింది. ఇక ప్రస్తుతం మహేష్ తన ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా దిల్‌రాజు-అశ్వనీదత్-పివిపిల భాగస్వామ్యంలో వంశీపైడిపల్లి దర్శకత్వంలో మహర్షి చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్ 5న విడుదల చేయాలని భావించారు. కానీ ఈ చిత్రం ఆ తేదీన రావడం లేదని తెలిసి ముందుగానే కౌంట్‌డౌన్ ప్రారంభించిన అభిమానులు నిరుత్సాహానికి లోనవుతున్నారు.
తాజాగా దిల్‌రాజు ఈ చిత్రం ఏప్రిల్25న విడుదల కానుందని అధికారికంగా ప్రకటించడం వారికి కాస్త ఊరటనిచ్చే విషయం. ఇక ఏప్రిల్ 5న వస్తే ఈ చిత్రానికి ఉగాది, శ్రీరామనవమి వంటి పండుగలను క్యాష్ చేసుకునే పరిస్థితి ఉండేదని కొందరి వాదన. కానీ ఉగాది, శ్రీరామనవమిలకు కేవలం ఒక రోజు చొప్పునే సెలవులు ఉంటాయి. ఉగాది, సంక్రాంతి, వేసవిలా వీటికి ఎక్కువ సెలవు దినాలు ఉండవు. అందునా ఏప్రిల్ 5 అంటే రెండు తెలుగు రాష్ట్రాలలోని విద్యార్ధులకు పరీక్షలు అన్ని అయిపోవు. ఈ దృష్ట్యా చూసుకుంటే ఏప్రిల్ 5 కంటే ఏప్రిల్ 25నే మహర్షి కి కలిసి వస్తుందని చెప్పాలి. వేసవి సెలవులు పూర్తిగా ఉండటం, పోటీగా మరో పెద్ద సినిమా అంటూ లేకపోవడం, మహేష్ 25వ చిత్రం 25వ తేదీనే విడుదల కానుండటం వంటి ఎన్నో ప్రత్యేకతలు దీనికి కలిసి వస్తాయి.
దీని తర్వాత మహేష్ సుకుమార్ దర్శకత్వంలో 26వ చిత్రం చేయనున్నాడు. గతంలో 1 (నేనొక్కడినే) ఇచ్చిన ఫ్లాప్‌కి బదులు తీర్చుకోవాలనే కసితో సుక్కు ఉన్నాడు. మొదట తెలంగాణ రజాకర్ల నాటి కథ చెప్పినా మహేష్ నో అనడంతో ప్రస్తుతం అడవి నేపధ్యంలో సాగే ఓ రివేంజ్ స్టోరీని సుక్కు చెప్పి మహేష్‌ని ఒప్పించాడని తెలుస్తోంది. ఇలాంటి కథను ఇప్పటివరకు చేయని మహేష్‌కి కథతో పాటు, ఆయన మేకోవర్‌తో కూడా తనదైన గిఫ్ట్‌ని ఇచ్చేందుకు సుక్కు రెడీ అవుతుండటం అభిమానులకు ఆనందం కలిగించే విషయమేనని చెప్పాలి.