హీరో మార్కెట్‌ని మించి ఖర్చు చేయడం ఆ తరువాత చేతులు కాల్చుకోవడం కొంత మంది నిర్మాతలకు పరిపాటిగా మారింది. ఇటీవల క్రేజీ కాంబినేషన్‌తో నేపాల్ నేపథ్యంలో ప్రేమకథా చిత్రాన్ని నిర్మించి చేతులు కాల్చుకున్న నిర్మాతని చూసిన కూడా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత అనిల్ సుంకర జాగ్రత్త పడటం లేదు. `ఇటీవల `కిరాక్ పార్టీ` చిత్రంతో నష్టాల్ని చవిచూసిన ఆయన మరోసారి అదే తప్పుచేస్తున్నాడని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అభిషేక్ అగర్వాల్‌తో కలిసి సహనిర్మాతగా (పేరుకే) వ్యవహరిస్తున్న ఓ సినిమా ఇటీవల ఇండియా- పాకిస్థాన్ బోర్డర్‌లోని జైసల్మేర్‌లో మొదలైంది.
గోపీచంద్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు తిరు దర్శకత్వం వహిస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. యాభై రోజుల పాటు జరిగే తాజా షెడ్యూల్‌లో రాజస్థాన్ , న్యూ ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో మెజర్ సీన్‌లని చిత్రీకరిస్తారట. వరుస ఫ్లాపులతో బెంబేలెత్తిపోతున్న గోపీచంద్ కోసం ఏకంగా 35 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. గోపీచంద్ మార్కెట్ గత కొంత కాలంగా డల్‌గా వుంది. దానికి తోడు ఆయనకు అంత మార్కెట్ కూడా లేదు. ఏ ధైర్యంతో 35 కోట్లు ఖర్చు చేస్తున్నారో అర్థం కావడం లేదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
సంపత్‌నంది దర్శకత్వంలో గోపీచంద్ చేసిన `గౌతమ్‌నంద` కోసం భగవాన్, పుల్లారవు 32 కోట్లు ఖర్చు చేశారు. భారీ స్థాయిలో నష్టపోయారు. ఆ సినిమా దెబ్బతో మళ్లీ సినిమా చేయలేదు. ఇంత తెలిసీ అనిల్ సుంకర ఏ ధైర్యంతో ఈ సినిమా చేస్తున్నాడని చాలా మంది ఇండస్ట్రీ వర్గాలు ఆరాతీస్తున్నారట. అయితే ఇన్నర్ టాక్ మాత్రం కథ డిమాండ్ మేరకు బడ్జెట్ పెడుతున్నారని వినిపిస్తోంది. ఎంత కథ డిమాండ్ చేసినా పెట్టిన పెట్టుబడి తిరిగిరావాలి కదా అన్నది మరికొందరి వాదన.