Advertisementt

క్రిష్ క్యారెక్టర్‌నే మార్చేస్తున్న ‘కథానాయకుడు’

Thu 24th Jan 2019 11:16 PM
krish,ntr biopic,ntr kathanayakudu movie,director krish,commercial way  క్రిష్ క్యారెక్టర్‌నే మార్చేస్తున్న ‘కథానాయకుడు’
Krish Changed His Character with NTR Biopic క్రిష్ క్యారెక్టర్‌నే మార్చేస్తున్న ‘కథానాయకుడు’
Advertisement
Ads by CJ

క్రిష్ డైరెక్ట్ చేసిన సినిమాలను పరిశీలిస్తే.. అందులో మానవ సంబంధాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఇప్పుడున్న రోజుల్లో అటువంటి కథలు.. ప్రశంసలకే కానీ.. వసూళ్లపరంగా మాత్రం నిరాశనే మిగుల్చుతున్నాయి. మొదటి సినిమా నుండి క్రిష్ ఏదో కొత్తగా తీద్దాం అనే ఉద్దేశంతోనే తీసిన సినిమాలు.. ‘గ‌మ్యం, వేదం, క్రిష్ణం వందే జ‌గ‌ద్గురుమ్‌, కంచె, గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి’ అన్ని ఇటువంటి బాపతే.

ఈ సినిమాలకి పేరు వచ్చింది కానీ కలెక్షన్ మాత్రం అంతగా రాలేదు. ఒక్క గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణికి మాత్ర‌మే డబ్బులు వచ్చాయి. గ‌మ్యం.. త‌న బ‌డ్జెట్‌కి న్యాయం చేసింది. వేదం, కృష్ణం వందే, కంచె… ఇవ‌న్నీ నిర్మాత‌ల‌కు న‌ష్టాల‌నే మిగిల్చాయి.  ఇక ఎన్టీఆర్ కథానాయకుడు గురించి అయితే వేరే చెప్పనవసరం లేదు. క్రిష్ కెరీర్ లోనే ఇది మొదటి డిజాస్టర్ గా నిలిచింది. వ్యాపార సూత్రాలు, క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌కు దూరంగా సాగుతాయి క్రిష్ సినిమాలు. 

కాకపోతే  క్రిష్ తీసిన సినిమాలన్నీ దాదాపుగా స్వీయ నిర్మాణంలోనే. ప్రస్తుతం క్రిష్ వాటిని దాటుకుని డబ్బులు వచ్చే సినిమాలు తీయాలి. లేకపోతే కెరీర్ పై ఎఫెక్ట్ పడుతుందనే పున‌రాలోచ‌న‌లో క్రిష్ ఉన్నట్లుగా సమాచారం. క్రిష్ తన స్నేహితులు దగ్గర మంచి సినిమాలు తీస్తున్న..డబ్బులు ఎందుకు రావడంలేదు..నేను కూడా మారాలా అని అంటున్నాడట. మరోపక్క క్రిష్ డైరెక్ట్ చేసిన రెండు సినిమాలు ఈనెల వచ్చే నెలలో రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాల రిజల్ట్ తేడా కొడితే తన స్టైల్ మార్చే అవకాశాలు లేకపోలేదు.

Krish Changed His Character with NTR Biopic:

Big Change in Krish with NTR Biopic

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ