సుకుమార్ ‘నాన్నకు ప్రేమతో’ సినిమా తర్వాత రామ్ చరణ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. అది కూడా 1980 కాలంనాటి సినిమా. పక్కా పల్లెటూరి బ్యాగ్డ్రాప్‌లో.. పిరియాడికల్ మూవీగా ఉండబోతుంది అనేసరికి, లెక్కలు మాస్టారు రామ్ చరణ్ ని ఏం చెయ్యబోతున్నాడో అనే అనుమానం కేవలం మెగా ఫాన్స్‌కి మాత్రమే కాదు... ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కలిగింది. కానీ సుకుమార్, రామ్ చరణ్ తో రంగస్థలం అనే విభిన్నమైన సినిమాని తీసి ప్రేక్షకులను మెప్పించాడు. రంగస్థలం అనే ఊరిలో పగలు, ఎలక్షన్స్ అనే కాన్సెప్ట్ తో సుకుమార్ సినిమాని తెరకెక్కించి అదుర్స్ అనిపించాడు. సుకుమార్ - రామ్ చరణ్ కెరీర్ లోనే రంగస్థలం బెంచ్ మార్క్ మూవీగా మిగిలిపోయింది.
ఇక సుకుమార్ తన నెక్స్ట్ సినిమాని మహేష్ తో చెయ్యబోతున్నాడు. ఈ సినిమా మొత్తం ఇన్వెస్టిగేషన్ బ్యాగ్డ్రాప్‌లో ఉండబోతోందనే ప్రచారం జరిగినా.. సుకుమార్ మాత్రం మహేష్‌తో ఒక స్మగ్లింగ్ బ్యాగ్డ్రాప్ లో సినిమా చెయ్యబోతున్నాడనేది లేటెస్ట్ న్యూస్. అది కూడా చిత్తూరు జిలాల్లో జరుగుతున్న ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందని సమాచారం. మరి ఎర్ర చందనం స్మగ్లింగ్ గురించి రోజు మనం ఏదో ఒక టీవీలోనో.. పేపర్‌లోనో చూస్తూనే ఉంటాం. మరి అలాంటి బ్యాగ్డ్రాప్‌లో సినిమా అంటే.. ఆ సినిమా మీద అంచనాలు మాములుగా ఉండవు సుమీ.
ఏదైనా రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్ మీద భారీ అంచనాలు, క్రేజ్ వచ్చేసాయి. అందుకే సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద హీరోలతో పని లేకుండానే క్రేజ్ ఉంటుంది. ఇక సుకుమార్ నెక్స్ట్ హీరో కూడా సూపర్ స్టార్.. మంచి క్రేజున్న హీరో మహేష్ కావడంతో.. సుకుమార్ - మహేష్ కాంబో మీద ప్రేక్షకుల్లోనూ, ట్రేడ్ లోను భారీ అంచనాలే ఉన్నాయి. ఇక వీరి కాంబోలో తెరకెక్కబోయే రెండో సినిమా జూన్ నుండి ప్రారంభం కానుంది.