గత ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా.. చాలా తక్కువ బడ్జెట్ తో థియేటర్స్ లోకొచ్చిన విజయ్ దేవరకొండ - పరశురామ్ ల గీత గోవిందం బంపర్ హిట్ కావడమే కాదు.. గీత ఆర్ట్స్ వారికి తిరుగులేని లాభాలను తెచ్చిపెట్టింది. విజయ్ దేవరకొండ కామెడీ టైమింగ్, రష్మిక మందన్న యాక్టింగ్.. పరశురామ్ డైరెక్షన్ అన్ని సినిమాకి పర్ఫెక్ట్ గా సెట్ అవడంతో.. చిన్న సినిమాగా చితక్కొట్టే కలెక్షన్స్ తో గీత గోవిందం అదరగొట్టే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ సినిమా కలెక్షన్స్ పెద్ద హీరోల సినిమాల కలెక్షన్స్ కి సమానంగా రావడంతో విజయ్ దేవరకొండ స్టార్ రేంజ్ తో పాటుగా క్రేజ్ కూడా విపరీతంగా పెరిగింది. ఆ సినిమా లాంగ్ రన్ లో 70 కోట్ల షేర్ ని తెచ్చింది.
తాజాగా మరో సినిమా ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా విడుదలై ఇప్పుడు గీత గోవిందానికి ఎసరు పెట్టేలా కనబడుతుంది. అదే సంక్రాంతికి విడుదలైన ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ మూవీ, వెంకటేష్ - వరుణ్ తేజ్ కలయికలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 2 సినిమా వెంకీ కామెడీ టైమింగ్ తో అదరగొట్టే బ్లాక్ బస్టర్ హిట్స్ లో చేరింది. ఇప్పటికి అంటే దాదాపు 11 రోజుల్లోనే ఎఫ్ 2 సినిమా 66 కోట్ల షేర్ ని ప్రపంచ వ్యాప్తంగా సాధించింది. ఇక లాంగ్ రన్ లో గీత గోవిందం 70 కోట్ల కలెక్షన్స్ ని ఎఫ్ 2 అధిగమించడం ఖాయమంటున్నారు.
మరి ఈ శుక్రవారం మిస్టర్ మజ్ను వచ్చే వరకు ఎఫ్ 2 దే హవా. అందుకే ఈ రెండు రోజుల్లోనే గీత గోవిందం కలెక్షన్స్ కి ఎఫ్ 2 ఎసరు పెట్టేస్తుందని.. లేదంటే లాంగ్ రన్ లో ఎఫ్ 2, గీత గోవిందం కలెక్షన్స్ క్రాస్ చేస్తుందని అంటున్నారు. మరి అఖిల్ మిస్టర్ మజ్ను వచ్చే వరకు ఎఫ్ 2 దే హవా అనడంలో సందేహమే లేదు. అందుకే గీత గోవిందం కలెక్షన్స్ ని ఎఫ్ 2 సునాయాసంగా దాటేస్తుందంటున్నాయి ట్రేడ్ వర్గాలు కూడా.