Advertisementt

ఇది మెగా, నందమూరి ఫ్యాన్స్ కోసమేనా అఖిల్?

Thu 24th Jan 2019 01:09 AM
mr majnu,akhil akkineni,jr ntr,mega and nandamuri fans,ram charan,party,mr majnu treat  ఇది మెగా, నందమూరి ఫ్యాన్స్ కోసమేనా అఖిల్?
Mr Majnu Treat for Mega and Nandamuri Fans ఇది మెగా, నందమూరి ఫ్యాన్స్ కోసమేనా అఖిల్?
Advertisement
Ads by CJ

అక్కినేని అఖిల్ నటించిన మూడో సినిమా మిస్టర్ మజ్ను ఈ శుక్రవారం థియేటర్స్ లోకి దిగబోతుంది. అఖిల్ కి టాలీవుడ్ లోని చాలామంది స్టార్ హీరోలతో సన్నిహిత సంబంధాలున్నాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలా చాలామందితో మంచి రిలేషన్ అఖిల్ మెయింటింగ్ చేస్తున్నాడు. నాగ చైతన్య లా సైలెంట్ గా ఉండకుండా..  అఖిల్ చాలా యాక్టీవ్‌గా ఉంటాడు. హలో సినిమా అప్పుడు చిరుని, చరణ్ ని గెస్ట్ లుగా పిలిచి మా పెదనాన్న చిరు, చరణ్ అన్నయ్య అన్నటువంటి అఖిల్... మిస్టర్ మజ్ను ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని పిలిస్తే.. నాగార్జున.. నా పెద్దకొడుకు తారక్ అంటూ స్పీచ్ ఇచ్చాడు.

మిస్టర్ మజ్ను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ పాల్గొని అఖిల్ గురించి చాలానే చెప్పాడు. ఇక అఖిల్ కి రామ్ చరణ్ మిస్టర్ మజ్ను ట్రైలర్ చూసి విష్ చేసాడు. తాజాగా అఖిల్, ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసున్న ఒక పిక్ ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. అయితే అఖిల్ మిస్టర్ మజ్ను ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తారక్ వచ్చాడు. కానీ చరణ్ రాలేదు. అయితే అదే రోజు అఖిల్ ఇచ్చిన స్పెషల్ పార్టీకి మాత్రం రామ్ చరణ్ కూడా అఖిల్, ఎన్టీఆర్ లతో జాయిన్ అయ్యాడు. రామ్ చరణ్, అఖిల్, ఎన్టీఆర్ లు కలిసి అఖిల్ మిస్టర్ మజ్ను పార్టీని బాగా ఎంజాయ్ చేసినట్లుగా కనబడుతుంది.

ఇక అదేరోజు అంటే మిస్టర్ మజ్ను ఈవెంట్ జరిగిన రాత్రే ఆ పార్టీ జరిగింది అనడానికి బలమైన కారణం..ఎన్టీఆర్ షర్ట్. ఎన్టీఆర్ మిస్టర్ మజ్ను ఈవెంట్ కి హాజరైన షర్ట్, ఆ పార్టీలో ఎన్టీఆర్ షార్ట్ ఒక్కటే కావడంతో.. మిస్టర్ మజ్ను ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన రాత్రే అఖిల్ తన బ్రదర్స్ కానీ బ్రదర్స్ కి మంచి పార్టీ ఇచ్చినట్లుగా ఉన్నాడు. మరి అఖిల్ పార్టీలో ఆ ఇద్దరు అంటే ఎన్టీఆర్, రామ్ చరణ్ అంటే స్పెషల్. ఆ విధంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులకు అఖిల్ గేలం వేసాడంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి. ఏదిఏమైనా అఖిల్, ఎన్టీఆర్, చరణ్ లా ఫోటో మాత్రం నెట్ లో బాగా వైరల్ అయ్యింది.

Mr Majnu Treat for Mega and Nandamuri Fans:

Akhil Gives Party to Ram Charan and Jr NTR

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ