ఈ ఏడాది స్టార్టింగ్ లోనే సూపర్ హిట్ సొంతం చేసుకున్న ఎఫ్ 2 సినిమాను అనిల్ రావిపూడి తనదైన స్టైల్ తో తీసి సక్సెస్ అయ్యాడు. అనిల్ తీసిన సినిమాలు వరసగా హిట్ అవ్వడంతో మనోడితో సినిమా చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎఫ్ 2 చివరిలో ఎఫ్ 3 ఉండబోతున్నట్టు చెప్పిన అనిల్ ఇందులో ఇద్దరు హీరోసే కాకుండా మరో హీరోకి కూడా ఛాన్స్ ఉన్నట్టు సమాచారం.
ఎఫ్ 2 లో తోడల్లుళ్లుగా వరుణ్ తేజ్ అండ్ వెంకీ నటించారు. అయితే ఎఫ్ 3 లో మరో హీరోకి కూడా ఛాన్స్ ఉందని టాక్ వస్తుంది. మరి ఆ మూడో హీరో ఎవరు అయ్యి ఉంటాడు అనేది చర్చ మొదలైంది. ఈ సినిమా ఇప్పటిలో స్టార్ట్ అవ్వకపోయిన వచ్చే ఏడాది ఉండొచ్చు అంటున్నారు. అయితే మూడో హీరో విషయంలో అనిల్ ఆల్రెడీ ఓ క్లారిటీ కి వచ్చాడని సమాచారం.
ఆ ఛాన్స్ రవితేజ లేదంటే నాని… ఇద్దరిలో ఒకరికి దక్కే అవకాశాలున్నాయని తెలుస్తోంది. రవితేజతో అనిల్ ‘రాజా ది గ్రేట్’ చేసిన అనుభవం ఉంది. రవి కామెడీ స్టైల్ ఎఫ్ 3 కి ఖచ్చితంగా సరిపోతుంది. ఒకవేళ రవిని ఎఫ్ 3 లో తీసుకుంటే సినిమాకు ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుందని చెబుతున్నారు. అయితే అనిల్ రవి వైపే కాకుండా నాని వైపు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు టాక్. నాని కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. ఇద్దరిలో ఎవరిని తీసుకున్న సినిమాకు మరింత హెల్ప్ అవుతుంది. మరి ఎవరిని తీసుకుంటాడో అనేది అనిల్ చేతిలోనే ఉంది.