Advertisementt

నరసింహస్వామి వైభవంతో సింహనాదం

Tue 22nd Jan 2019 10:08 PM
simhanadam,movie,launch,details  నరసింహస్వామి వైభవంతో సింహనాదం
Simhanadam Movie Launched నరసింహస్వామి వైభవంతో సింహనాదం
Advertisement
Ads by CJ

శ్రీకారం చుట్టుకున్న సింహనాదం

శ్రీ లిఖిత మూవీ మేకర్స్-శ్రీ వైష్ణవ స్పిరిటైన్ మెంట్స్ సంయుక్తంగా.. యువ ప్రతిభాశాలి పి.శ్రీనివాస్ దర్శకత్వంలో నిర్మిస్తున్న భక్తిరస ప్రధాన చిత్రం ‘సింహనాదం’ (శ్రీ నరసింహస్వామి వారి వైభవం).  సుమన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. 

హైద్రాబాద్, భారతీయ విధ్యభవన్ లో జరిగిన కార్యక్రమంలో పలువురు స్వామిజీల ఆశీస్సులతో ఈ చిత్రం టైటిల్ లోగోను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో సింహయాజి స్వామి,  కామిశెట్టి శ్రీనివాస్, రామానుజాచార్యులు, విశ్రాంత న్యాయమూర్తి మాల్యాద్రి, బేజీపీ నాయకురాలు గీతామూర్తి, ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్(గోపి) తదితరులు పాల్గొన్నారు. 

శ్రీనరసింహస్వామి వైభవాన్ని చాటి చెబుతూ.. పి.శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సింహనాదం’ చిత్రం ఘన విజయం సాధించాలని వీరంతా అభిలషించారు.  ఈసందర్భంగా.. 

శ్రీ అహోబిల నరసింహ స్వామిపై తాళ్ళపాక అన్నమాచార్యులు రచించిన కీర్తనలతో కూడిన ‘సర్వం సింహమయం’ ఆడియో సీడీ ఆవిష్కరించారు. సుమన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం కోసం ప్రస్తుతం ఇతర నటీనటుల ఎంపిక జరుపుతున్నామని, త్వరలోనే సెట్స్ కు వెళ్లనున్నామని దర్శకుడు పి.శ్రీనివాస్ తెలిపారు.

ఈ చిత్రానికి కూర్పు: ఆవుల వెంకటేష్, ఛాయాగ్రహణం: మణి-దిలీప్, సంభాషణలు: చిట్టిశర్మ, సంగీతం: విజయ్ కురాకుల, నిర్మాణం: శ్రీలిఖిత మూవీ మేకర్స్-శ్రీ వైష్ణవ స్పిరిటైన్ మెంట్స్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: పి.శ్రీనివాస్.

Simhanadam Movie Launched:

Simhanadam Movie Details