Advertisementt

ఫిదా అయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

Tue 22nd Jan 2019 08:22 PM
vijay deverakonda,deverakonda,vijay deverakonda roudy club,roudy fans  ఫిదా అయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
vijay deverakonda childhood video trending ఫిదా అయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
Advertisement
Ads by CJ

లేటెస్ట్ టాలీవుడ్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ. `అర్జున్‌రెడ్డి` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత విజ‌య్ మానియా టాలీవుడ్‌ని ఓ కుదుపు కుదిపేస్తోంది. అత‌ని క్రేజ్ ఈ మ‌ధ్య వ‌చ్చిన ఏ హీరోకూ తేక‌పోవ‌డం విశేషం. త‌న క్రేజ్‌కి త‌గ్గ‌ట్లే విజ‌య్ త‌న కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటూ ప‌లువురికి పోటీగా నిలుస్తున్నాడు. రౌడీ అంటూ ఓ సెప‌రేట్ బ్రాండ్‌ని క్రియేట్ చేసుకున్న ఫాలోయింగ్ సోష‌ల్ మీడియాలో మామూలుగా లేదు.  యువ‌త‌లో రోజు రోజుకీ హాట్ ఫేవ‌రేట్‌గా మారిపోతున్నాడు. దీంతో అత‌నికి సంబంధించిన ప్ర‌తీదీ సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతోంది. 

తాజాగా స‌తీష్ అనే ఓ అభిమాని ఓ వీడియోను షేర్ చేసి విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఫిదా చేయ‌డం ఆస‌క్తిగా మారింది. ఓ చిన్ని పిల్ల‌వాడు షావుకారు జాన‌కిని ఏదో అడుగుతున్న‌ వీడియోను ట్యాగ్ చేసి `ఇత‌ని విజ‌య్ దేవ‌ర‌కొండేనా? న‌ఆకు క్లారిటీగా తెలియ‌దు` అంటూ  క్యాప్ష‌న్ ఇచ్చి ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. ఆ విడియోలో క‌నిపిస్తున్నచిన్న బుడ‌త‌డు `చ‌దువు మానేసి పుట్ట‌ప‌ర్తికి వ‌చ్చిన స్వామివారు ఇక్క‌డ ఏం చేశారు టీచ‌ర్‌` అంటూ అడ‌గ‌డం అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఇంత‌కీ ఆ వీడియో వున్న బుడ‌త‌డు మ‌రెవ‌రో కాదండోయ్ టాలీవుడ్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌. 

ఈ వీడియోని చూసి ముగ్ధుడైన‌ విజ‌య్ దేవ‌ర‌కొండ  `నా చిన్న‌నాటి విష‌యాలు సోష‌ల్ మీడియాలో బాగానే ట్రెండ్ అవుతున్న‌ట్టున్నాయ్‌. ఈ వీడియోను ఎవ‌రు పోస్ట్ చేశారో తెలియ‌దు కానీ వాళ్లు నాకు, మా అమ్మ‌ మాతో పాటు నా అభిమానుల‌కు అంతులేని ఆనందాన్ని క‌లిగించాడు. వీడియోలో వున్న‌ది నేనే. అయితే ఆ వీడియోలోని ఆ గొంతు నాదే అయితే ఎంత బాగుండో మ‌ళ్లీ ఒక్కసారి నా చిన్న‌నాటి గొంతును వినే అవ‌కాశం చిక్కేది` అంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా విజ‌య్ స్పందించ‌డం ఆక‌ట్టుకుంటోంది. 

vijay deverakonda childhood video trending:

vijay deverakonda childhood video

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ