Advertisementt

ప‌డి ప‌డి..నిర్మాతకు శ‌ర్వా సాయం!

Tue 22nd Jan 2019 06:59 PM
sharwanand,padi padi leche manasu,sudhakar herukuri,chandu mondeti,hanu raghavapudi  ప‌డి ప‌డి..నిర్మాతకు శ‌ర్వా సాయం!
sharwanand helping sudhakar cherukuri ప‌డి ప‌డి..నిర్మాతకు శ‌ర్వా సాయం!
Advertisement
Ads by CJ

త‌న వ‌ల్ల న‌ష్ట‌పోయిన నిర్మాత‌కు మ‌రో సినిమా చేస్తూ హీరోలు ఆ న‌ష్టాన్ని పూడ్చే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. అదే ప‌ని శ‌ర్వానంద్ చేయ‌బోతున్నాడు. ఇటీవ‌ల శ‌ర్వానంద్ న‌టించిన చిత్రం `ప‌డి ప‌డి లేచే మ‌న‌సు`. హ‌ను రాఘ‌వ‌పూడి రూపొందించిన ఈ చిత్రాన్ని నూత‌న నిర్మాత సుధాక‌ర్ చెరుకూరి నిర్మించారు. సినిమా నిర్మాణం, ప‌బ్లిసిటీ మొత్తం క‌లిపి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు ఖ‌ర్చు పెట్టించింది 33 కోట్ల. వ‌చ్చింది మాత్రం ప13 కోట్లే. దీంత ఈ సినిమా తీసుకున్న బ‌య్య‌ర్స్ 20 కోట్లు న‌ష్ట‌పోయారు.

శ‌ర్వానంద్ మార్కెట్‌ని మించి ఖ‌ర్చు చేసిన ఈ సినిమాకు ఇంత బ‌డ్జెట్ అవ‌స‌ర‌మా? అని ప‌లువురు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెప్పిన పెడ‌చెవిన పెట్టిన హ‌ను రాఘ‌వ‌పూడి ఈ సినిమా రూపంలో బ‌య్య‌ర్ల‌కు భారీ స్థాయిలోనే శ‌ఠ‌గోపం పెట్టేశాడు. ఆ న‌ష్టాల్ని భ‌ర్తీ చేయ‌డం కోసం సుధాక‌ర్ చెరుకూరికి శ‌ర్వానంద్ మ‌రో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. ఈ చిత్రానికి చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. ఇప్ప‌టికే శ‌ర్వాకు క‌థ వినిపించాడ‌ని, కొత్త త‌ర‌హా ప్రేమ‌క‌థ కావ‌డంతో శ‌ర్వా, సుధాక‌ర్ చెరుకూరి ఓకే చేశార‌ని తెలిసింది. అయితే ఇక్క‌డో చిక్కుంది. 

`ప్రేమ‌మ్‌` రీమేక్‌తో సాలీడ్ హిట్‌ని సొంతం చేసుకున్న చందూ మొండేటిని నాగ‌చైత‌న్య‌తో చేసిన `స‌వ్య‌సాచి` ఫ‌లితం చాచి కొట్టింది. దీని నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని చూస్తున్న చందూ మొండేటి శ‌ర్వాకు హిట్టిస్తాడా అన్న‌ది కొంత ఆలోచించాల్సిన విష‌య‌మే. అయినా త‌ప్ప‌దు కాబ‌ట్టి అత‌ను చెప్పిన క‌థ న‌చ్చి శ‌ర్వానంద్ మ‌రో ఆలోచ‌న లేకుండా క‌మిట్ అయిన‌ట్టు చెబుతున్నారు. మ‌రి ఈ సినిమాతో అయినా సుధాక‌ర్ చెరుకూరి హిట్టిస్తాడా?. `ప‌డి ప‌డి..`తో న‌ష్టాలు చ‌విచూసిన బ‌య్య‌ర్స్ బ‌య‌ట‌ప‌డ‌తార అన్న‌ది చందూ మొండేటి చేతుల్లోనే వుంది.

sharwanand helping sudhakar cherukuri:

chandu modeti to direct sharwanand

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ