Advertisementt

హిట్ వచ్చినా.. ఈ భామని పట్టించుకోవట్లే..!!

Tue 22nd Jan 2019 01:05 PM
young heroine,mehreen,dilemma,f2,movies  హిట్ వచ్చినా.. ఈ భామని పట్టించుకోవట్లే..!!
Young Heroine in Dilemma హిట్ వచ్చినా.. ఈ భామని పట్టించుకోవట్లే..!!
Advertisement
Ads by CJ

ఈ సంక్రాంతికి బుల్లి మల్టీస్టారర్ గా పెద్దగా  ప్రమోషన్స్ లేకుండా బరిలోకి దిగి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సినిమా. అనిల్ రావిపూడి పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించిన ఈ సినిమాతో దిల్ రాజు చాలా రోజుల తర్వాత తిరుగులేని హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ కౌర్ లు నటించారు. ఇక సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా హిట్ లో మేజర్ క్రెడిట్ వెంకటేష్ కి దక్కితే.. తర్వాత దిల్ రాజు కి, అనిల్ రావిపూడి సమానమైన క్రెడిట్స్ దక్కాయి. కానీ హీరోయిన్స్ తమన్నా, మెహ్రీన్ లు ఈ హిట్ సినిమాలో భాగమైన పెద్దగా పట్టించుకున్నోళ్ళు కనబడడం లేదు.

ఈ  సినిమాలో గ్లామర్ షో చేసినా ఈ భామలిద్దరూ.... ఎఫ్ 2 హిట్ తో మంచి అవకాశాలు వస్తాయనుకుంటే.... ఎఫ్ 2 హిట్ ఈ హాట్ భామలకు ఉపయోగం లేకుండా పోయింది. భర్తను ప్రస్టేట్ చేసే భార్యగా తమన్నా..... కట్టుకోబోయే వాడిని కాల్చుకుతినే అమ్మాయిగా మెహ్రీన్ లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక వెంకటేష్ కామెడీ.. దిల్ రాజు డబ్బుకి.. అనిల్ రావిపూడి దర్శకత్వానికి దాసోహమన్న మీడియా వాళ్ళు తమన్నాని, మెహ్రీన్ లను పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రమోషన్స్ లోను ఎడా పెడా కనిపించిన ఈ భామలకు ఫలితం సూన్యంలా కనబడుతుంది. 

మరి ఇప్పటికే ఫేడవుట్ లిస్టులో ఉన్న తమన్నాకి సీనియర్ హీరోలెవరైనా ఛాన్స్ లిస్తారో లేదో అనేది చూడాలి.. మరోపక్క కుర్ర హీరోల పక్కన నటించడానికి మెహ్రీన్ సై అన్నా.. వారు ఆమెకి పిలిచి అవకాశం ఇవ్వాలిగా. ఎందుకంటే చాలా సినిమాల ప్లాప్ తో ఐరెన్ లెగ్ ముద్ర వేయించుకున్న మెహ్రీన్ కి ఈ ఎఫ్ 2 హిట్ ఎంత మేర మేలు చేకూరుస్తుందో చూడాలి. అందుకే అన్నారు హిట్ వచ్చినా.. లాభం లేదని...!

Young Heroine in Dilemma :

No Movies to Heroine Mehreen

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ