Advertisementt

‘96’పై అంత ప్రేమ ఏంటో మరి..?

Tue 22nd Jan 2019 12:41 PM
dil raju,next movie,96 remake  ‘96’పై అంత ప్రేమ ఏంటో మరి..?
Dil Raju Eye on 96 ‘96’పై అంత ప్రేమ ఏంటో మరి..?
Advertisement
Ads by CJ

గత ఏడాది కుర్ర హీరోలతో చేసిన సినిమాలన్నీ బోల్తా పడడంతో.. ఈ ఏడాది వెంకటేష్ - వరుణ్ తేజ్ లతో కలిసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దిల్ రాజు మళ్ళీ ఎడా పెడా సినిమాలు నిర్మించే ఆలోచనకు స్వస్తి చెప్పినట్టుగా తెలుస్తుంది. కుర్ర హీరోలకు లైఫ్ ఇస్తున్నానంటూ... వారితో ఎడా పెడా సినిమా చేసిన దిల్ రాజుకి తెలివి వచ్చినట్టుగా కనబడుతుంది. ఒక హిట్ కొట్టిన డైరెక్టర్స్ ని లాక్ చేసే అలవాటున్న దిల్ రాజు.. ఇప్పుడు కాస్త ఆలోచనతో వ్యవహరిస్తున్నట్టుగా కనబడుతుంది. దిల్ రాజుకి గత ఏడాది చివరిలో తమిళ సినిమా 96 మీద కన్ను పడిన సంగతి తెలిసిందే. ఆ సినిమాని తెలుగులో రీమేక్ చెయ్యాలని ఆ సినిమా తమిళనాట విడుదల కాకముందే డిసైడ్ అయ్యాడు. ఆ సినిమా తమిళంలో హిట్ కావడం.. తెలుగులో హీరో హీరోయిన్ దొరక్క మొదలవ్వడానికి బాగా టైం పట్టింది.

ఆ సినిమా రీమేక్ విషయంలో బాగా పట్టుదలగా ఉన్న దిల్ రాజు ఎట్టకేలకు ఆ సినిమా కోసం శర్వానంద్ అండ్ సమంతలు ఒప్పించి ఆ సినిమాని ఓ కొలిక్కి తెచ్చాడు. ఆ సినిమాని నిర్మించి హిట్ కొట్టాలని డిసైడ్ అవడంతో దిల్ రాజు తన అప్ కమింగ్ ప్రాజెక్టులను మూడిటీని పక్కనపెట్టేశాడనే టాక్ నడుస్తుంది. ఆ మూడు సినిమాలేవంటే.. శేఖర్ ఖమ్ములతో ఫిదా హిట్ కొట్టిన దిల్ రాజు... శేఖర్ తదుపరి ప్రాజెక్ట్ కూడా తన బ్యానర్ లోనే చెయ్యాలని ఒప్పించాడు.. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.. తాజాగా దిల్ రాజు - శేఖర్ కమ్ముల ఆ సినిమాని పక్కన పెట్టినట్లుగా ఫిలింనగర్ టాక్.

ఇక రెండోది ఇంద్రగంటి మోహన కృష్ణ మల్టీస్టారర్ మూవీని కూడా దిల్ రాజు ప్రస్తుతం ఆపేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఎప్పటినుండి హరీష్ తో సినిమా చెయ్యడానికి దిల్ రాజు దాగుడు మూతలాడుతున్నాడు. మరా సినిమాని దిల్ రాజు ఎప్పుడో వదిలేసినట్టుగా.. హరీష్ శంకర్ మరో మూవీ రీమేక్ ప్రయత్నాలు మొదలెట్టినట్టుగా సోషల్ మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. అయితే దిల్ రాజు ఈ సినిమాలన్నీ కేవలం 96 కోసమే పక్కన పెట్టినట్లుగా సోషల్ మీడియా టాక్.

Dil Raju Eye on 96:

Dil Raju next Project is 96 Remake

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ