Advertisementt

‘వినయ విధేయ రామ’ అక్కడ భారీ ప్లాప్..!

Mon 21st Jan 2019 10:22 PM
ram charan,vinaya vidheya rama,flop,overseas  ‘వినయ విధేయ రామ’ అక్కడ భారీ ప్లాప్..!
No Collections to Vinaya Vidheya Rama Movie ‘వినయ విధేయ రామ’ అక్కడ భారీ ప్లాప్..!
Advertisement
Ads by CJ

ఈ సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే అందులో ఒక సినిమా తప్ప ఇంకేమి టాక్ పరంగా..వసూల్ పరంగా హిట్ అవ్వలేకపోయాయి. ముందుగా వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న వసూల్ పరంగా ఫెయిల్ అయింది. రజిని పేటకు థియేటర్స్ చాలా తక్కువ రావడంతో, కంటెంట్ పరంగా కూడా అంత గొప్పగా ఏమీ లేకపోవడంతో ఈ సినిమా కూడా నెగటివ్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

ఎఫ్ 2 విషయానికి వస్తే మొదటి రోజు నుండి ఈ సినిమా సూపర్ హిట్ అనే టాక్ సొంతం చేసుకుని ఇప్పటికి కొన్ని ఏరియాస్ లో స్ట్రాంగ్ గా నడుస్తుంది. ఇక దీని ముందు రిలీజ్ అయిన రామ్ చరణ్ - బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ సంగతి సరే సరి, ప్రీమియర్ షోల నుండే అతి దారుణమైన డిజాస్టర్ టాక్ ను ఓవర్సీస్ లో దారుణమైన పరిస్థితి ఎదురుకుంది.

ఈ సినిమాను అక్కడ 1మిలియన్ డాలర్లకు కొంటే, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రాకపోగా, భారీ నష్టాన్నే మిగిల్చింది ఈ సినిమా. 2లక్షల 25 వేల డాలర్ల క్లోసింగ్ గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. అందులో క్లోసింగ్ షేర్ 102k డాలర్స్ మాత్రమే కలెక్ట్ చేసింది. అంటే 1లక్షా 25వేల డాలర్లు అంటే పెట్టిన 1మిలియన్ డాలర్ల పెట్టుబడి రాకపోగా, డిస్ట్రిబ్యూటర్ కు అదనంగా 23వేల డాలర్ల నష్టం మిగిలిందన్నమాట.

No Collections to Vinaya Vidheya Rama Movie:

Vinaya Vidheya Rama flop at Overseas

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ