Advertisementt

స్టైలిష్ స్టార్ అల్లు అర్జునే ముఖ్య అతిథి

Mon 21st Jan 2019 08:02 PM
lovers day,priya prakash varrier,allu arjun,chief guest,audio launch  స్టైలిష్ స్టార్ అల్లు అర్జునే ముఖ్య అతిథి
Lovers Day Audio Launch Update స్టైలిష్ స్టార్ అల్లు అర్జునే ముఖ్య అతిథి
Advertisement
Ads by CJ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన ‘లవర్స్ డే’ ఆడియో రిలీజ్ వేడుక 

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘ఒరు ఆడార్ ల‌వ్‌’ ప్రచార చిత్రంలో కొంటెగా కంటి సైగతో మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.  అంతేకాకుండా 2018లో గూగుల్‌లో టాప్‌ ట్రెండింగ్‌లో ఒకరిగా ఓ ఘనతను సాధించింది. ‘ఒరు ఆడార్ ల‌వ్‌’లో కేవ‌లం 27 సెక‌న్ల పాటు ఆమె చేసిన క‌నుసైగ‌కు రెండు రోజుల్లోనే 45 ల‌క్ష‌ల వ్యూస్ వ‌చ్చాయి. ఇప్ప‌టికి రెండు కోట్ల మంది ఆ వీడియో చూశారు.

ఇలా ప్రస్తుతం యూత్‌ను విశేషంగా ఆకట్టుకొన్న ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన ‘ఒరు ఆడార్ ల‌వ్‌’ చిత్రం తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో విడుదలకు సిద్ధమైంది. మలయాళంలో క్రేజీ డైరెక్టర్ ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిర్మాతలు ఎ. గురురాజ్‌, సి.హెచ్‌.వినోద్‌రెడ్డి సుఖీభ‌వ సినిమాస్ బ్యానర్‌పై ప్రేమికుల దినం రోజు అంటే ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. మలయాళ వెర్షన్ కూడా అదే రోజున విడుదల కానుంది .

ఇప్పటికే ‘లవర్స్ డే’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకొన్నాయి. ప్రచార కార్యక్రమంలో భాగంగా ‘లవర్స్ డే’ సినిమా ఆడియో రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో జనవరి 23న వైభవంగా నిర్వహించేందుకు నిర్మాతలు గురురాజ్, వినోద్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 

‘లవర్స్ డే’ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు ఆహ్వానించిన వెంటనే అల్లు అర్జున్ మా కోరికను మన్నించి ఒప్పుకొన్నారు. ఆయన రానుండటంతో మా సినిమాకు మరింత క్రేజ్ పెరిగింది. మా ఆహ్వానాన్ని సహృదయంతో అంగీకరించిన అల్లు అర్జున్‌కు మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నామని.. నిర్మాతలు గురురాజ్, వినోద్ రెడ్డి తెలిపారు. 

న‌టీన‌టులు: నూరిన్ షెరిఫ్‌, రోష‌న్‌, మాథ్యూ జోస‌ఫ్‌, వైశాఖ్ ప‌వ‌న‌న్‌, మైఖేల్ యాన్ డేనియ‌ల్‌, దిల్‌రూపా, హ‌రీష్ పెరుమ‌న్న‌, అనీష్ జి మీన‌న్‌, షాన్ సాయి, అర్జున్ హ‌రికుమార్‌, అతుల్ గోపాల్‌, రోష్న అన్‌రాయ్ త‌దిత‌రులు.

సాంకేతిక నిపుణులు: 

కెమెరా :  శీను సిద్ధార్థ్‌

ఎడిటింగ్‌: అచ్చు విజ‌య‌న్‌

సంగీతం:  షాన్ రెహ‌మాన్‌

స్క్రీన్‌ప్లే:  సారంగ్ జ‌య‌ప్ర‌కాష్‌, లిజో ప‌నాడా

క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: ఒమ‌ర్ లులు

నిర్మాత‌లు: ఎ. గురురాజ్‌, సి.హెచ్‌.వినోద్‌రెడ్డి

Lovers Day Audio Launch Update :

Allu Arjun Chief Guest to Lovers Day Audio Launch

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ