ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటి భాగమైన ఎన్టీఆర్ కథానాయకుడు రిజల్ట్ వల్ల తీసుకొన్న నిర్ణయమో లేక ఫస్ట్ పార్ట్ చూసి సీనియర్స్ చెప్పిన మార్పులో తెలియదు కానీ.. సెకండ్ పార్ట్ అయిన ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను రీషూట్ చేస్తున్నారు. నిజానికి ఫస్ట్ పార్ట్ రిలీజ్ టైమ్ కే సెకండ్ పార్ట్ ఫస్ట్ కాపీ కూడా రెడీ అయిపోయింది. కానీ.. ఫస్ట్ పార్ట్ లో ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం వల్లనే జనాలు ఎక్కువగా సినిమా చూడడానికి ఆసక్తి చూపించలేదని అర్ధం చేసుకున్న క్రిష్, బాలయ్య సెకండ్ పార్ట్ లోని ఎమోషనల్ సీన్స్ ను ఇంకాస్త ఇంటెన్సిటీతో రీషూట్ చేస్తున్నారట.
ఇక కర్ణుడి మరణానికి వంద కారణాలు అన్నట్లుగా.. ఎన్టీఆర్ కథానాయకుడు ఫ్లాప్ కి కూడా బోలెడన్ని కారణాలున్నాయి. ఆ సినిమా ఎలాగూ పోయింది కాబట్టి.. ఇక ఆ పరాజయం గురించి ఆలోచించకుండా.. సెకండ్ పార్ట్ లో బంపర్ హిట్ కొట్టి మొదటి సినిమాతో పోగొట్టుకున్నదంతా రాబట్టుకోవాలని ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. మరి ఈ రీషూట్స్ పుణ్యమా అని సినిమా కంటెంట్ ఇంకాస్త ఇంప్రూవ్ అయ్యి సెకండ్ పార్ట్ అయినా ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో చూడాలి.
ఏదేమైనా ఫస్ట్ పార్ట్ మాత్రం 2019 ఆల్ టైమ్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ఎందుకంటే.. 70 కోట్ల రూపాయల మేరకు బిజినెస్ జరిగిన ఈ చిత్రం కనీసం 25 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. దాంతో డిస్ట్రిబ్యూటర్స్ అందరూ భారీ స్థాయిలో నష్టపోయారు. వాళ్ళు కూడా ఇప్పుడు సెకండ్ పార్ట్ మీదే నమ్మకం పెట్టుకొన్నారు.