దేశం గర్వించదగ్గ సినిమాలు తీస్తాడని రాజమౌళికి ఎంతమంచి పేరు ఉన్నా.. సినిమాలు చాలా స్లోగా తీస్తాడనే చెడ్డ పేరు కూడా ఉంది. ఒకానొక సందర్భంలో తనకు సినిమాలు త్వరగా తీయడం రాదని, అది పూరీ జగన్నాధ్ దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నానని రాజమౌళి స్వయంగా ప్రకటించుకున్న విషయం కూడా తెలిసిందే. త్రివిక్రమ్ మీద కూడా ఇలాంటి చెడ్డ పేరే ఉండేది కానీ.. సన్నాఫ్ సత్యమూర్తి టైమ్ నుంచి పోగొట్టుకున్నాడు. ఇప్పుడు రాజమౌళి కూడా తన మీద ఉన్న చిన్నపాటి అపనిందను కూడా పోగొట్టుకోవడానికి సన్నద్ధమవుతున్నాడు.
బాహుబలి లాంటి ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ అనంతరం ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో క్రేజీయస్ట్ మల్టీస్టారర్ చిత్రాన్ని మొదలెట్టిన రాజమౌళి ఆ చిత్రాన్ని కుదిరినంత త్వరగా పూర్తిచేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అందుకే.. ఒకేసారి నాలుగైదు స్టూడియోల్లో డిఫరెంట్ సెట్స్ వేయించాడట. సో, ఒక సెట్ లో తాను షూట్ చేస్తుండగానే.. తన అసిస్టెంట్ టీం తో వేరే సెట్ లో వేరే సన్నివేశాలను షూట్ చేయించాలని ప్లాన్ చేస్తున్నాడట. ఆన్లైన్ ఎడిటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి.
ఈ స్పీడ్ మరియు ప్రొసీజర్ లో గనుక వర్కవుట్ అయితే ఆర్.ఆర్.ఆర్ ప్రొజెక్ట్ అనుకున్నదానికంటే త్వరగా పూర్తవ్వడమే కాదు 2020లోనే విడుదల కూడా అయిపోతుంది. ఈ విషయం తెలిసాక.. నిన్నమొన్నటివరకూ తమ అభిమాన హీరోల సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని కంగారుపడుతున్న నందమూరి, మెగా అభిమానులు ఈ విషయం తెలిసాక ఊపిరి పీల్చుకున్నారు.