Advertisementt

పుండుమీద కారం జ‌ల్లుతున్నాడుగా..?

Mon 21st Jan 2019 04:18 PM
rgv,laxmis ntr,ntr kathanayakudu,ram gopal varma,ntr,ntr biopic,laxmi parvathi,chandrababu naidu,  పుండుమీద కారం జ‌ల్లుతున్నాడుగా..?
rgv sensetional post on ntr and cbn పుండుమీద కారం జ‌ల్లుతున్నాడుగా..?
Advertisement
Ads by CJ

ఇల్లు కాలి ఒక‌డు ఏడుస్తుంటే... నా మ‌ర‌మ‌రాలు మాడిపోయాయ్ కొంచెం వెతికి పెట్టండి గురూ అన్న‌డ‌ట వెన‌క‌టి ఒక‌డు అలాగే వుంది రామ్‌గోపాల్‌వ‌ర్మ సంగ‌తి. భారీగా ప‌బ్లిసిటీ ఇచ్చి ఎంతో గొప్ప‌లు చెప్పి తీసిన బ‌యోపిక్ ఖ‌ర్చు సంగ‌తి అలా వుంచితే సినిమా చూడ‌టానికి జాన‌లే థియేట‌ర్‌కి రాని ప‌రిస్థితి. ఎన్టీఆర్ బ‌యోపిక్ డిజాస్ట‌ర్‌గా నిలిచింద‌న‌న్న బాధలో చిత్ర బృందం వుంటే పుండు మీద కారం జ‌ల్లిన చందంగా మూలిగే న‌క్క‌మీద తాటిపండు ప‌డిన‌ట్టు ఆ సినిమాకు వ్య‌తికేకంగా రోజుకో వీడియోని, మార్ఫింగ్ ఫొటోని వ‌దులుతూ తెగ‌ ఎంజాయ్ చేస్తున్నాడు రామ్‌గోపాల్‌వ‌ర్మ‌. `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` ప్రారంభించిన ద‌గ్గ‌రి నుంచి ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న వ‌ర్మ తాజాగా `బాహుబ‌లి`ని కూడా వాడేశాడు.

వెన్నుపోటు అంటూ బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప వెన్నుపోటు పొడిచే స‌న్నివేశాన్ని అడ్డుపెట్టుకుని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నాడు. బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప వెన్నుపోటు పొడిచే స‌న్నివేశానికి సంబంధించిన ఫోటోని చంద్ర‌బాబు, ఎన్టీఆర్‌ల మాస్కుల‌తో మార్ఫింగ్ చేసిన వ‌ర్మ ఆ ఫోటోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసి `ఇక్క‌డ క‌నిపిస్తున్న వ్యక్తులు  నాకు సిగా గుర్తు రావ‌డం లేదు. వీరిని గుర్తుప‌డ్డ‌టంలో నాకు సాయం చేయండి` అంటూ వెట‌కారంగా పెట్టిన పోస్ట్ సోష‌ల్ మీడియాఓ ఓ రేంజ్ లో వైర‌ల్‌గా మారింది. సినిమా విడుద‌ల‌కు ముందే వ‌ర్మ మార్ఫింగ్ ఫోటోల‌తో ఆడుకుంటే ఇక విడ‌దుల స‌మ‌యంలో...విడుద‌ల త‌రువాత చంద్ర‌బాబు నాయుడును ఏ రేంజ్‌లో ఆడుకంటాడో ఎక్స్‌పెక్ట్ చెయ్య‌డం కొంచెం క‌ష్ట‌మే అంటున్నారు.

rgv sensetional post on ntr and cbn:

rgv sensetional post on cbn

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ