మెగా హీరోలందరిలో రామ్ చరణ్, అల్లు అర్జున్ లే ఓ రేంజ్ లో దూసుకుపోతున్న స్టార్ హీరోలు. మెగాస్టార్ తర్వాత అల్లు అర్జున్ కి, రామ్ చరణ్ కి ఆమధ్య గట్టి పోటీనే నడుస్తుంది. అయితే ఆ పోటీ బయట జనాలకు ఆరోగ్యకర పోటీగా కనబడుతున్నప్పటికీ.. రామ్ చరణ్ కి, అల్లు అర్జున్ కి మధ్యన గట్టి పోటీ నడుస్తుందనేది తెలిసిందే. గత రెండు సినిమాల విషయంలో రామ్ చరణ్ స్టార్ రేంజ్ ని అందుకున్నాడు. మగధీర తర్వాత మధ్యలో యావరేజ్ హిట్స్ అందుకున్న రామ్ చరణ్ ధృవ, రంగస్థలం సినిమాతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ రేంజ్ స్టార్ హీరోలకు కూడా అందనంత ఎత్తుకు పెరిగిపోయింది. ఇక సినిమాల విషయంలో ఎప్పుడు సేఫ్ గేమ్ ఆడే అల్లు అర్జున్ గత రెండు సినిమాలు అంటే డీజే దువ్వాడ జగన్నాధం సినిమా యావరేజ్ కాగా.. నా పేరు సూర్యతో భారీ డిజాస్టర్ అందుకున్నాడు.
నా పేరు సూర్యతో గత ఆరు నెలలుగా అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్ట్ ని మొదలెట్టడానికి ఆలోచిస్తున్నాడు అంటే.. ఆ ప్లాప్ తో అల్లు అర్జున్ ఎంతగా కృంగిపోయాడో తెలుస్తుంది. మరోపక్క రామ్ చరణ్ రంగస్థలం బ్లాక్ బస్టర్ తో ఉన్నాడు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ కి పడిన ప్లాప్ తో బన్నీ హ్యాపీ అంటూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. రామ్ చరణ్ - బోయపాటి కాంబోలో తెరకెక్కిన వినయ విధేయ రామ విడుదలైన ఫస్ట్ షోకే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. రామ్ చరణ్ వినయ విధేయ రామ యాక్షన్ పాళ్ళు ఎక్కువవడంతో ప్రేక్షకులు వినయ విధేయ రామని తిప్పికొట్టారు.
మరోపక్క నెగెటివ్ టాక్ తో వినయ విధేయ రామ కలెక్షన్స్ అదుర్స్ అంటూ రోజువారీ లెక్కలు బయటికొస్తున్నాయి. మరి వినయ విధేయ రామ హిట్టా పట్టా అనేది కొద్దిగా అంటే మరో వారంలో తేలిపోతుంది. అయితే వినయ విధేయ రామ ఫలితంతో రామ్ చరణ్ సైలెంట్ అయినా.. బన్నీ హ్యాపీ అంటున్నారు కొందరు. గత రెండు సినిమాల ప్లాప్స్ తో ఉన్న బన్నీ.. రామ్ చరణ్ కి వినయ విధేయ రామ ప్లాప్ తగలడంతో తనపై కాస్త భారం తగ్గినట్లుగా ఫీలవుతున్నాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో నడుస్తుంది.