తన కెరీర్‌లో ఫ్యామిలీ గురించి గానీ, తన భార్య, పిల్లల విషయంలో గానీ ఎప్పుడు మాట్లాడని స్టార్ వెంకటేష్. ఆయన ఫ్యామిలీ సభ్యులందరు లోప్రొఫైల్ మెయిన్‌టెయిన్ చేస్తూ మీడియాకు దూరంగా ఉంటారు. వెంకీ కూడా వారి విషయాలను గురించి మీడియాకు పెద్దగా చెప్పడు. ఇక ప్రస్తుతం వెంకీ ‘గురు’ చిత్రం తర్వాత తనకి అచ్చివచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఎఫ్ 2’లో భార్యాబాధితునిగా హాస్యాన్నిఅద్భుతంగా రక్తి కట్టించాడు. ఈ మూవీని ఆయన తన భుజస్కంధాలపైనే మోశాడనడం అతిశయోక్తి కాదు. ఈ విజయానందంలో ఉన్న వెంకీ తాజాగా తన ఫ్యామిలీ విషయాలపై నోరువిప్పాడు.
ఆయన తన భార్య గురించి మాట్లాడుతూ, ‘ఎఫ్ 2’లో నేను పోషించిన పాత్రకు నిజజీవితంలో పూర్తి విరుద్దంగా ఉంటాను. అందరు భార్యలు పక్కనలేనప్పుడు రెచ్చిపోతారని అంటూ ఉంటారు. నా వైఫ్‌తో లైఫ్ వండర్‌ఫుల్‌గా ఉంది. మా ఆవిడ ఎప్పుడు నా పక్కన ఉంటేనే నాకెంతో ఆనందం. ఆమె పక్కనుంటే నేను రెచ్చిపోతాను. ప్రతిరోజు ఆమెకి ప్రత్యేకంగా కొంత సమయం కేటాయిస్తాను. కలిసే భోజనం చేస్తాం.. అప్పుడప్పుడు కలిసి రెస్టారెంట్లకు వెళ్తూ ఉంటాం.
‘ఎఫ్ 2’లో నేను అంతలా ఎంజాయ్ చేస్తూ కామెడీని బాగా పండించానంటే ఆ క్రెడిట్ మొత్తం నా భార్యదే అని ఆమెకి సర్టిఫికేట్ ఇచ్చేశాడు. మొత్తానికి ‘ఎఫ్ 2’లో భార్యాబాధితునిగా కనిపించిన వెంకీ నిజజీవితంలో మాత్రం ‘భార్యావిధేయుడు’ అని చెప్పాలి. అంటే తెరపై పూలరంగడు.. ఇంట్లో మాత్రం భార్యాప్రియుడు అన్నమాట...!