శంకర్ చిత్రం అంటే ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కావాల్సినంత బడ్జెట్, సినిమా అవుట్‌పుట్ తాను అనుకున్నట్లు వచ్చే దాకా షూటింగ్‌కి ఒప్పుకుంటేనే ఆయన నిర్మాతలకు అవకాశం ఇస్తాడు. ఆయనతో ఓ చిత్రం చేయాలని భావించే నిర్మాతలు సైతం ఆయన చెప్పినట్లు వినాల్సిందే. కానీ ఈయన తన కెరీర్‌లో ‘3ఇడియట్స్’ని విజయ్‌తో ‘స్నేహితుడు’గా తీశాడు. ఇది అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు. తర్వాత ‘ఐ’ కూడా ఆయన స్థాయిలో లేదనే విమర్శలు వచ్చాయి.
‘2.ఓ’ విషయానికి వస్తే గ్రాఫిక్స్, సాంకేతికత మీద పెట్టిన శ్రద్ద ఎమోషన్స్‌పై పెట్టలేదని స్పష్టమైంది. వీటన్నింటిని విశ్లేషించుకునే ఆయన ప్రస్తుతం కమల్ రాజకీయ భవితకు కూడా ఉపయోగపడేలా ‘భారతీయుడు 2’ని ఆవిష్కరిస్తున్నాడు. ఇందులో కమల్‌హాసన్‌తో పాటు కాజల్ నటిస్తోంది. మరోవైపు ఆయన ఇందులో అజయ్‌దేవగణ్‌ని విలన్ పాత్రకు తీసుకోవాలని భావించాడట. కానీ వీలు కాకపోవడంతో ‘2.ఓ’లో విలన్‌గా నటించిన బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్‌తోనే ముందుకు వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘సేనాపతి’ మనవడిగా శింబుని అనుకున్నా చివరి క్షణంలో ఆస్థానంలో సిద్దార్ద్‌ని ఎంచుకున్నాడని తెలుస్తోంది. అంతేకాదు.. ఏ ఆర్ రెహ్మాన్‌ని కాదని అనిరుద్‌కి అవకాశం ఇచ్చాడు. ఇలా ఈ చిత్రం విషయంలో శంకర్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.
భారతీయుడు కథ గురించి ఆయన మాట్లాడుతూ, నా కాలేజీ రోజుల్లో అడ్మిషన్ కోసం కాలేజీకి వెళ్లితే వారు కుల, ఆదాయ దృవీకరణ పత్రాలను అడిగారు. దాంతో నా తల్లిదండ్రులతో ఆయా సంబంధిత అధికారుల వద్దకు వెళ్లితే వారు కుల, ఆదాయ దృవీకరణ పత్రాల కోసం లంచం అడిగారు. అదే ‘భారతీయుడు’కి స్ఫూర్తిగా మారింది. ‘భారతీయుడు 2’లో కూడా నేటి సామాన్యుడు ఎదుర్కొంటున్న సమస్యలను చూపించనున్నామని తెలిపాడు.
ఇక శంకర్ రెహ్మాన్‌ని కాదని అనిరుధ్‌ని ఎంచుకోవడానికి ఇదే కారణం అంటూ కోలీవుడ్‌లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ‘2.ఓ’కి శంకర్‌ని సంతృప్తిపరిచే ట్యూన్స్‌ని రెహ్మాన్ ఇవ్వలేదట. మరికొన్ని ట్యూన్స్ కావాలని శంకర్ కోరినా కూడా రెహ్మాన్ పట్టించుకోలేదని, దాంతో ప్రస్తుతం ట్యూన్స్‌తో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్‌లో కూడా ఇరగదీస్తున్న తమిళ నెంబర్‌వన్ సంగీత దర్శకుడు అనిరుధ్‌కి చాన్స్ ఇచ్చాడని తెలుస్తోంది.